Moviesబాబాయ్ బాల‌య్య సెంటిమెంట్‌తో అమిగోస్ హిట్టేనా.. ఆ సెంటిమెంట్ ఇదే…!

బాబాయ్ బాల‌య్య సెంటిమెంట్‌తో అమిగోస్ హిట్టేనా.. ఆ సెంటిమెంట్ ఇదే…!

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ చాలా రోజుల త‌ర్వాత గ‌తేడాది బింబిసార లాంటి డిఫ‌రెంట్ స్టోరీతో త‌న కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. క‌ళ్యాణ్‌రామ్ కు గ‌త కొన్నేళ్ల‌లో ప‌టాస్ త‌ర్వాత 118 సినిమాతో మాత్ర‌మే హిట్ ద‌క్కింది. ఇక బింబిసార అయితే ఆల్ టైం కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ప‌డింది. ఈ సినిమాకు ముందున్న క్రేజ్ డ‌బుల్ అయ్యింది. బింబిసార త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తోన్న సినిమా అమిగోస్‌. ఇది ఓ స్పానిష్ ప‌దం.

మైత్రీ మేక‌ర్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాతో రాజేంద్ర‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్‌లో క‌ళ్యాణ్‌రామ్ మూడు పాత్ర‌లు కూడా రివీల్ చేశాడు. అందులో నెగ‌టివ్ షేడ్‌లో ఉన్న పాత్ర‌లో క‌ళ్యాణ్‌రామ్ స‌రికొత్త స్టైల్లో ఉన్నాడు.

అమిగోస్ సినిమాను మైత్రీ వాళ్లు ఏపీ, తెలంగాణ వ‌ర‌కు రు. 9 కోట్ల‌కు ముందే విక్ర‌యించేశారు. ఆడియో, డిజిట‌ల్‌, ఓటీటీ రైట్స్‌తో కూడా మైత్రీ వాళ్ల‌కు మంచి లాభాలే వ‌చ్చాయంటున్నారు. ఇక బాబాయ్ బాల‌య్య చాలా రోజుల త‌ర్వాత వ‌రుస‌గా అఖండ‌, వీర‌సింహారెడ్డి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు అబ్బాయ్ క‌ళ్యాణ్‌రామ్ కూడా చాలా రోజుల త‌ర్వాత బింబిసార‌.. ఇప్పుడు అమిగోస్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేలా ఉన్నాడ‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

బాల‌య్య‌కు వ‌రుస హిట్లు గ‌త కొన్నేళ్ల‌లో రాలేదు. అఖండ సినిమాతో వ‌చ్చిన అపార‌మైన క్రేజ్‌తో వీర‌సింహారెడ్డి యావ‌రేజ్ కంటెంట్‌తో.. అందులోనూ సంక్రాంతికి గ‌ట్టి పోటీ మ‌ధ్య‌లో వ‌చ్చి సూప‌ర్ హిట్ కొట్టింది. ఇప్పుడు క‌ళ్యాణ్‌రామ్‌కు కూడా బింబిసార సినిమాతో అద్భుత‌మైన క్రేజ్ వ‌చ్చింది. అదే క్రేజ్ ఇప్పుడు అమిగోస్‌కు కూడా ముందే క‌నిపిస్తోంది. బాబాయ్ సెంటిమెంట్ అబ్బాయ్‌కు కూడా వ‌ర్క‌వుట్ అయితే అమిగోస్ కూడా హిట్టే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news