Moviesకె. విశ్వ‌నాథ్ - బాల‌య్య రికార్డు ఎప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌దు… ఆ...

కె. విశ్వ‌నాథ్ – బాల‌య్య రికార్డు ఎప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌దు… ఆ రికార్డ్ ఇదే..!

క‌ళాత‌ప‌స్వి, సీనియ‌ర్ ద‌ర్శ‌కులు కె. విశ్వ‌నాథ్ మృతి టాలీవుడ్‌కు మాత్ర‌మే కాదు భార‌తీయ సినిమా రంగానికే ఎప్ప‌ట‌కీ తీర‌ని లోటు. ఎంతోమంది స్టార్ హీరోలు విశ్వనాథ్‌ దర్శకత్వంలో ఒక్క సినిమా చేస్తే చాలు తమ జన్మ ధన్యం అయిపోతుందని.. ఎన్నో రోజులు ఆయన చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కే విశ్వనాథ్ మృతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం స్పందించారంటే విశ్వనాథ్ ఎంత గొప్ప వ్యక్తితో అర్థమవుతుంది. మరియు ముఖ్యంగా భారతీయ సంస్కృతి.. సంప్రదాయాలతో పాటు మన తెలుగుదనాన్ని తన సినిమాలలో అనువణువు ప్రతిబింబించేలా చేసేందుకు ఆయన ఎంతో కష్టపడేవారు

ఆయన తీసిన అద్భుతమైన సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పటికీ గర్వకారణంగా నిలిచి ఉంటాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు సినిమాకు ఎంతో వన్నెతెచ్చిన విశ్వనాథ్‌ గారి సేవలను తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటుంది. ఇక కే విశ్వనాథ్‌ గారికి నందమూరి నటసింహం బాలకృష్ణకు ఎంతో అనుబంధం ఉంది. విశ్వనాథ్ గారు అంటే బాలయ్య ఎంతో అభిమానిస్తాడు.

ఆయన ఎప్పుడు ఎక్కడ కనిపించిన బాలయ్య ఆప్యాయతతో పలకరిస్తారు. బాలయ్యకు సీనియర్లు అంటే ఎప్పుడూ గౌరవమే. అందులో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా మరింత ఇనుమడింపజేసిన విశ్వనాథ్ అంటే మరింత మక్కువ. విశ్వనాథ్‌ దర్శకత్వంలో బాలయ్య నటించిన సినిమా జననీ జన్మభూమి. 1984 లో రిలీజ్ అయిన ఈ సినిమా సరిగా ఆడలేదు. అయితే బాలయ్యకు విశ్వనాథ్ కు మధ్య ఎంతో అనుబంధం ఉంది.

బాలయ్య నటించిన నాలుగు సినిమాలలో ఆయనకు తండ్రి పాత్రల్లో విశ్వనాథ్‌ నటించారు. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన నరసింహనాయుడు సినిమాతో పాటు సీమ సింహం – లక్ష్మీ నరసింహ – పాండురంగడు సినిమాలలో బాలయ్య తండ్రి పాత్రలో కళాతపస్వి అలరించారు. బాలయ్యకు తండ్రిగా నటించడం అంటే విశ్వనాథ్ కు ఎంతో ఇష్టం. విచిత్రం ఏంటంటే ఈ నాలుగు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. అందులో నరసింహనాయుడు – సీమసింహం – లక్ష్మీ నరసింహ సంక్రాంతి విజయాలుగా నిలిచాయి. ఈ రికార్డ్ ఎప్ప‌ట‌కీ అలాగే ఉండిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news