Moviesషాకింగ్‌: చైతు - స‌మంత మ‌ళ్లీ క‌లుస్తున్నారా… సామ్ నుంచే సంకేతాలు…!

షాకింగ్‌: చైతు – స‌మంత మ‌ళ్లీ క‌లుస్తున్నారా… సామ్ నుంచే సంకేతాలు…!

టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ సమంత నాగచైతన్యకు ఒకప్పుడు మోస్ట్ క్యూట్ కపుల్‌గా మంచి పేరు ఉండేది. 2010లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట ఏకంగా ఏడేళ్ల పాటు ప్రేమించుకుని 2017లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ ఏడు సంవత్సరాలలో సమంత సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయింది. సమంత – నాగచైతన్య కలిసి మొత్తం ఐదు సినిమాలలో నటించారు. ఆన్ స్క్రీన్ మీద అయినా ఆఫ్ స్క్రీన్ లో అయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసేది.

నాలుగు సంవత్సరాల కాపురం అనంతరం చైతన్య ఇద్దరు 2021 సెప్టెంబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అసలు వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏంటన్నది ? ఎప్పటికీ ఎవరికీ తెలియవు. కొందరు సమంత వైపు నుంచి తప్పు అంటుంటే… మరికొందరు అక్కినేని ఫ్యామిలీ పెట్టిన కండిషన్ల వల్లే ఆ బంధం తెంచుకుందని కూడా అంటున్నారు. నాగచైతన్యతో విడిపోయినా కూడా సమంత ఇప్పటికీ అక్కినేని కుటుంబంతో మంచి అనుబంధం కొనసాగిస్తున్నట్లు పలుమార్లు రుజువైంది.

తాజాగా అక్కినేని అఖిల్ షేర్ చేసిన ఒక పోస్టుకు సైతం సమంత స్పందించింది. అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు పవర్ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో కూడా షేర్ చేశాడు. దీనికి సమంత లైక్ కొట్టడంతో పాటు బీస్ట్ మోడ్ అంటూ కామెంట్ చేసింది.

నాగచైతన్యతో విడిపోయక కూడా గత ఏడాది అఖిల్ బర్త్‌డే కు శ్యామ్ శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గా సమంత శాకుంతలం పోస్టును అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుశాంత్ తన ఇన్‌స్టా స్టోరీ లో కూడా షేర్ చేశాడు. ఈ ప‌రిణామాలు చూస్తోన్న వారు స‌మంత మ‌ళ్లీ చైతుతో క‌లిసేందుకు.. అక్కినేని ఫ్యామిలీలో ఎంట్రీ ఇచ్చేందుకు కాకా ప‌డుతోంద‌ని అంటున్నారు.

నిజానికి చైతుతో విడిపోయాక స‌మంత కెరీర్ పైపై మెరుగుల్లాగానే బాగున్న‌ట్టు క‌నిపిస్తున్నా ఆమెకు అన్ని ఇబ్బందులే చుట్టుమ‌డుతున్నాయి. పుష్ప‌లో ఐటెం సాంగ్ హిట్ అయినా ఆమె పేరు మొత్తం తీసేసింది. ఆరోగ్య ప‌రంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యాయి. పేరుకు మాత్రం హాలీవుడ్ ప్రాజెక్టులు అంటున్నా ఆమె గ్రాఫ్ అయితే డౌన్ అయిపోతోంది. ఈ నేప‌థ్యంలో ఆమె జీవితంలో రెండో పెళ్లికి స్కోప్ ఉన్నా అక్కినేని అంత అనుబంధం ఉన్న కుటుంబం దొర‌క‌దు అన్న నిర్ణ‌యానికి కూడా ఆమె వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు అన్న‌ట్టుగా మ‌ళ్లీ ఆమె చైతుతో క‌లిసి జీవించే దిశ‌గానే ఆమె ప్ర‌య‌త్నాలు ఉన్నాయంటున్నారు. అందుకే అక్కినేని ఫ్యామిలీని వ‌దులుకోలేక వాళ్ల‌తో ట‌చ్‌లో ఉంటోంద‌ని టాక్ ??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news