Moviesఆఖరికి ఆ హీరోతో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ..నవ్వాలో ఏడవాల్లో తెలియని పోజీషన్...

ఆఖరికి ఆ హీరోతో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ..నవ్వాలో ఏడవాల్లో తెలియని పోజీషన్ లో ఫ్యాన్స్..!!

స్టార్ డాటర్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు చేసింది చాలా తక్కువ సినిమాలు .. హిట్ కొట్టింది మరీ తక్కువ ..అయినా సోషల్ మీడియాలో అమ్మడుకున్న క్రేజ్ చూస్తే మతులు పోవాల్సిందే ..దిమ్మతిరిగే ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ..జాన్వి కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది . అయితే ఎన్టీఆర్ 30 సినిమాతో జానీ తెలుగుతర ఎంట్రీ అంటూ ఫిక్స్ అయిపోయిన జనాలకు బాడ్ న్యూస్ వినిపించాడు బోనీకపూర్ .

ఎన్టీఆర్ థర్టీ సినిమాలో జాన్వీ నటించట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే జాన్వి ని.. విజయ్ దేవరకొండ తెలుగులో పరిచయం చేయబోతున్నాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు జాన్వి – విజయ్ దేవరకొండ స్పందించనే లేదు . అయితే బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం స్క్రిప్ట్ కు సంబంధించిన వర్కులు పూర్తవుతున్నాయి అంటూ తెలుస్తుంది. ఇదే క్రమంలో కోలీవుడ్ లోనూ జాన్వి కపూర్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే విశాల్ నటించబోయే సినిమాలో జాన్వి హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటికే బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న జాన్వి టాలీవుడ్ లో నటించక ముందే ఆ క్రేజ్ ను శ్రీదేవి పుణ్యమా అంటూ సంపాదించుకునేసింది. ఇప్పుడు కోలీవుడ్ లోనూ తన పేరుని మారుమ్రోగి పోయే విధంగా జాన్వి ప్లాన్ చేసుకుంటుంది . అయితే కోలీవుడ్ స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్న విశాల్ పక్కన జాన్విని హీరోయిన్గా ఊహించుకుంటుంటేనే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు అంటూ ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ కామెంట్స్ పెడుతున్నారు . కాగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తో సినిమాను మిస్ చేసుకున్న జాన్వి విశాల్ తో ఎలా నటించడానికి ఒప్పుకుందో..? అంటూ చర్చించుకుంటున్నారు. దీనికి సమాధానం జాన్వి ఇస్తేనే బాగుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news