MoviesChiranjeevi మెగా దుమారం రేపుతున్న చిరంజీవి ట్వీట్ .. మిగతవాళ్ళు బోకులా...

Chiranjeevi మెగా దుమారం రేపుతున్న చిరంజీవి ట్వీట్ .. మిగతవాళ్ళు బోకులా సార్..?

పాపం.. తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమాతో రామ్ చరణ్ పేరు పాన్ ఇండియా లెవల్ లో మారుమ్రోగిపోతుంది. అంతేకాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగాఆర్ఆర్ఆర్ సినిమా ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది .

కాగా రీసెంట్ గానే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం త్వరలోనే ఆస్కార్ అవార్డు ను కూడా అందుకోబోతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే అంతర్జాతీయ వేదికలపై పెను ప్రభంజనం సృష్టిస్తుంది ఆర్ ఆర్ ఆర్. కాగా రీసెంట్ గా దగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాడుతూ ..”తనకు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ పాత్ర ఎంతగానో నచ్చిందని.. రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ఈ పాత్రకి రామ్ చరణ్ తప్పిస్తే వేరే ఏ నటుడు సూట్ అవ్వడని అంతలా ఒదిగిపోయిన నటించాడని రామ్ పాత్ర ఏంటో పూర్తిగా అర్థమయిపోయిన తర్వాత హృదయం బరువుకే విధంగా ఉంది ” అంటూ చెప్పకు వచ్చాడు .

తాజాగా ఇదే వీడియోని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు . “గ్లోబల్ ఐకాన్ జేమ్స్ కెమెరూన్ లాంటి దర్శకుడు రామ్ పాత్ర బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.. ఇది ఆస్కార్డ్ అవార్డుకు ఏ మాత్రం తక్కువ కాదు ..అంటూ రాంచరణ్ ను రేంజ్ లో పొగిడేసారు. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ రాజమౌళి..అంతేకాదు ఈ సినిమా చరణ్ మాత్రమే హీరో కాదు.. ఎన్టీఆర్ కూడా ఉన్నారు.. వాళ్ళిద్దరి పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళిద్దరి పేర్లు ప్రస్తావించకుండానే నీ కొడుకుని పొగుడుకున్న అంటే మిగతా వాళ్ళు బోకులా ..? అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు . దీంతో గతంలో మగధీర సినిమా విషయంలోనూ ఆ సినిమా హిట్ అవ్వడానికి రామ్ చరణ్ నే కారణమంటూ చేసిన చిరంజీవి కామెంట్స్ మరోసారి ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని ఏకిపారేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news