Moviesఇంట్రెస్టింగ్: హీరో రాజశేఖర్ కు సాయి పల్లవికి మధ్య ఉన్న రిలేషన్...

ఇంట్రెస్టింగ్: హీరో రాజశేఖర్ కు సాయి పల్లవికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

సాధారణంగా జనాలకు ఓ అపోహ ఉంటుంది.. సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ గా ఉన్న వ్యక్తులు చదువులో దద్దమ్మలని.. ఆ కారణంగానే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్స్ గా మారారని చాలామంది అంటుంటారు.. అంతెందుకు ఇప్పటికీ ఎవరైనా ఇంట్లో మేము హీరో అవుతాం.. మేము హీరోయిన్ అవుతాము అంటే.. ముందు అన్ని మూసుకొని చదువు కోండి .. ఆ తర్వాత ఏదైనా చేయండి..చదువు లేకుండా ఎక్కడికెళ్ళినని గౌరవం ఉండదు అంటూ తిడుతూ ఉంటారు ..అంతలా స్టార్ సెలబ్రిటీస్ ని అవమాన పరుస్తూ ఉంటారు .

అయితే మన ఇండస్ట్రీలో కూడా డాక్టర్స్ ఎంతో పెద్ద చదువులు చదివిన స్టార్స్ ఉన్నారు. పెద్ద చదువులు చదివి సినిమాపై ఉన్న మక్కువుతో తమకి ఇష్టమైన వృత్తిని మధ్యలోనే ఆపేసి ఇటువైపుగా వచ్చిన స్టార్ చాలామంది ఉన్నారు . వాళ్ళల్లో కొందరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…!!

అల్లు రామలింగయ్య : ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు .. ప్రజెంట్ అల్లు ఫ్యామిలీ ఈ పొజిషన్లో ఉండడానికి మెయిన్ రీసన్ అల్లు రామలింగయ్య . అయితే అందరూ అనుకున్నట్టు అల్లు రామలింగయ్య కమెడియన్ నే కాదు ..ఆయుర్వేదంలో ఈయనకు మంచి పట్టు ఉంది ..హోమియో వైద్యుడిగా అల్లు రామలింగయ్య సుప్రసిద్ధుడు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో అందరికీ హోమియో మందులు అందించి .. పలు రోగాలను నయం చేసిన ఘనత అల్లు రామలింగయ్య కే దక్కింది.

రాజశేఖర్ : టాలీవుడ్ యాంగ్రీ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న రాజశేఖర్ కూడా డాక్టరే ..టాలీవుడ్ లో వైద్యుడిగా మంచి పేరుంది. చాలామందిని తన అద్భుతమైన ట్రీట్మెంట్తో బాగు చేసిన ఘనత కూడా రాజశేఖర్ కి ఉంది. కాగా ప్రజెంట్ ఇండస్ట్రీలో ఆఫర్స్ లేక ఖాళీ గా ఉన్నాడు రాజశేఖర్.

సాయి పల్లవి : ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . అమ్మడు ఎంబిబిఎస్ చేసి .. నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇటువైపుగా మళ్ళింది . మల్లర్ సినిమాతో మలయాళాని.. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఊపేసింది సాయి పల్లవి . ఎప్పుడైనా సరే మళ్లీ డాక్టర్ వృతిని చేపడుతాను అంటూ చెప్పుకొస్తుంది.

శ్రీ లీల : టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల కూడా ఎంబిబిఎస్ చదువుతుంది . ఓవైపు స్టార్ హీరోయిన్గా ఉంటూనే ..తనకు డాక్టర్ అవ్వాలని ..ఆ కల నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ ఏడాది ఈమె డాక్టర్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉన్న ఈ బ్యూటీ రీసెంట్ గానే ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ప్రస్తుతం తెలుగులో యువ హృదయాలను కొల్లగొడుతూ బిగ్ స్టార్ సినిమాలో ఆఫర్ అందుకుంటుంది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news