MoviesPrabhas ప్రభాస్ స్పిరిట్ పై పిచ్చెక్కించే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఇక...

Prabhas ప్రభాస్ స్పిరిట్ పై పిచ్చెక్కించే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఇక ఫ్యాన్స్ ఆగలేరుగా..!!

టాలీవుడ్ రెబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకుని.. సౌత్ లోనే నెంబర్ వన్ హీరోగా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఒక్కో సినిమా కి 100-150 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ నటించిన సినిమా ఆది పురుష్..రిలీల్ కు సిద్ధ్మగా ఉంది.

ప్రజెంట్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కే ప్రాజెక్టుకె.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సలార్.. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కే రాజా డీలక్స్ షూటింగ్స్ చివరి షెడ్యూల్స్ లో ఉన్నాయి . అన్ని ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసి వరుసగా హిట్లు అందుకోవడానికి రెడీగా ఉన్నాడు . ఇలాంటి క్రమంలోని ప్రభాస్ అభిమానులకు పిచ్చెక్కించే అప్డేట్ ఇచ్చాడు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.

అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. స్పిరిట్ గా నామకరణం చేసిన ఈ సినిమా షూటింగ్ ఆయన చేస్తున్న యానిమల్ సినిమా కంప్లీట్ అవగానే స్టార్ట్ చేస్తారట . అంతే కాదు ప్రభాస్ అభిమానులు కనీ విని ఎరుగని విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ రీసెంట్గా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . అసలు ఈ సినిమా ఉంటుందా..? లేదా దొబ్బేస్తుందా..? అంటూ టెన్షన్ పడుతున్న ప్రభాస్ అభిమానులకు ఒక్కసారిగా ఈ కామెంట్స్ ఊపిరిని అందించాయి . సందీప్ రెడ్డి కామెంట్స్ తో ఫాన్స్ ఓ రేంజ్ లో స్పిరిట్ సినిమా ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news