టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్న లేడీ సింగర్ల సంఖ్య తక్కువేం కాదు. స్టార్ సింగర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న సింగర్లకు మంచి రెమ్యునరేషన్ దక్కుతోంది. కొంతమంది సింగర్లు డబ్బింగ్ ఆర్టిస్టులుగా పని చేస్తూనే స్టేజ్ షోలలో పాడటం, విదేశాల్లో ఈవెంట్లలో పాల్గొనడం ద్వారా ఊహించని స్థాయిలో సంపాదిస్తూ ఆర్థికంగా స్థిరపడుతున్నారు.
మరి కొందరు సింగర్లకు హీరోయిన్ల స్థాయిలో అందం ఉన్నా ఆ సింగర్లు మాత్రం తెర వెనుకే ఉండిపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కో పాటకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే సింగర్ల సంఖ్య తక్కువేం కాదు. అయితే ఒక స్టార్ సింగర్ భర్త గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. పైకి ప్రొఫెషనల్ గా కనిపించే ఆ స్టార్ సింగర్ భర్తకు అమ్మాయిల పిచ్చి ఎక్కువని సమాచారం.
ఆయన సన్నిహితులలో అతికొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసని బోగట్టా. ఆ స్టార్ సింగర్ భర్త తన సహాయం కోరిన ఏ అమ్మాయిని వదలడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే ఆయన మంచి స్థాయిలో ఉండటం వల్ల అతని వల్ల వేధింపులకు గురైన అమ్మాయిలు సైతం ఆరోపణలు చేయడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. భర్త నిజస్వరూపం ఆ స్టార్ సింగర్ కు తెలిసినా ఆమె మాత్రం భర్తను ఎలాంటి ప్రశ్నలు అడగటం లేదని సమాచారం.
సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు ఈ తరహా వ్యవహారాలు కామన్ అని ఆ స్టార్ సింగర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బయట వినిపిస్తున్న వార్తలతో పోల్చి చూస్తే పది రెట్లు ఎక్కువగా ఉందని సమాచారం. ఈ విషయాలను బయటకు వెల్లడిస్తే పోయేది తమ పరువేనని చాలామంది అమ్మాయిలు క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు మెదపడం లేదు. క్యాస్టింగ్ కౌచ్ కు నో చెప్పడం వల్లే టాలీవుడ్ అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు రావడం లేదని టాక్ ఉంది.
ఈ రీజన్ వల్లే ఇతర భాషల్లో సక్సెస్ అవుతున్న తెలుగు హీరోయిన్లు తెలుగులో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించి ఫిర్యాదులు అందుతున్నా ఇండస్ట్రీ పెద్దలు సైతం కొన్ని ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని బోగట్టా. ఆ ఫిర్యాదులను పట్టించుకోవడం వల్ల తాము ఇతరులకు టార్గెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారట.