MoviesSir Movie Review ధనుష్ 'సార్' పబ్లిక్ టాక్ : హిట్టా..ఫట్టా..?

Sir Movie Review ధనుష్ ‘సార్’ పబ్లిక్ టాక్ : హిట్టా..ఫట్టా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ గా చేసిన సినిమా “సార్”. కొద్దిసేపటి క్రితమే గ్రాండ్గా ధియేతర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది.

ఈ చిత్రంపై తెలుగు తమిళ భాషల్లో సాలిడ్ బజ్ ఉంది . కాగా విడుదలైన ఫస్ట్ షోకే సినిమా ఇంతటి పాజిటివ్ టాక్ సంపాదించుకోవడం తో మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . కాగా సమాజంలో జరుగుతున్న విద్యావ్యవస్థ లో ఉన్న లుసుగులను క్లియర్గా బయట పెడుతూ వెంకి అట్లూరి సాహసం చేసాడనే చెప్పాలి . చదువు పేరుతో డబ్బును ఎలా గుంజుకుంటున్నారో ..ఎలా కోట్లు సంపాదిస్తున్నారో అనే అంశాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి చాలా అద్భుతంగా చూపించాడు .

మరి ముఖ్యంగా ఈ సినిమాల్లో ధనుష్ పర్ఫామెన్స్ టు గుడ్ అంటున్నారు జనాలు . రఘువరన్ బీటెక్ తర్వాత ధనుష్ అంత ఎమోషనల్ గా డీప్ గా కనిపించిన సినిమా ఇదే అంటూ జనాలు పొగిడెస్తున్నారు . నేటి సమాజంలో విద్యావ్యవస్దలో ఉన్న తప్పులను చూపించే విషయంలో వెంకీ అట్లూరి సూపర్ సక్సెస్ అయ్యాడు . ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ధనుష్ నటన..సినిమాలో వచ్చే పంచ్ డైలాగ్స్.. కచ్చితంగా థియేటర్లో ధనుష్ ని చూసిన ప్రతి ఇండియన్ ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు.

అంతేకాదు ధనుష్ కెరియర్ లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లెదౌ. మరి ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్వీస్ట్ కి జనాలు షాక్ అయిఓతారు. నిజంగా ఇది హార్ట్ టచింగ్ ఫిలిం అని ధనుష్ కి హ్యాట్స్ హాఫ్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సినిమాకి ఏకంగా 3.5 రేటింగ్ ఇస్తూ ధనుష్ ఫ్యాన్స్ సార్ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు ..చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news