MoviesVeerasimhaReddy వావ్: "వీరసింహారెడ్డి" ఫైనల్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా.. అసలు...

VeerasimhaReddy వావ్: “వీరసింహారెడ్డి” ఫైనల్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయలేరు..!!

టాలీవుడ్ నందమూరి హీరో బాలయ్య తాజాగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ..ఫస్ట్ షో కే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా నందమూరి హీరోను మాస్ – క్లాస్ పాత్రలో చూపించి గోపీచంద్ మలినేని సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు .

అంతే కాదు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ తమన్ మ్యూజిక్ , ప్రతి సీన్లోనూ గోపీచంద్ మలినేని ఎంత కేర్ఫుల్గా తెరకెక్కించారో.. అంతే జాగ్రత్తగా తమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంగీతం అందించారు . దానికి తగ్గట్టే బాలకృష్ణను థియేటర్స్ లో చూస్తున్న జనాలు ఊగిపోయారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన శృతిహాసన్ ..హనీ రోజ్ కూడా సినిమాకి మంచి హైలెట్గా నిలిచారు .

కాగా మొదటి రోజే యాభై నాలుగు కోట్లు గ్రాస్ రాబట్టి సెన్సేషన్ రికార్డ్ సృష్టించిన బాలయ్య వీరసింహారెడ్డి ..ఫైనల్ కలెక్షన్స్ కి సంబంధించిన లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75.90 కోట్లు సాధించింది అంటూ చెప్పుకొస్తున్నారు . అందులో మరి ముఖ్యంగా ఆంధ్ర , తెలంగాణ తో కలిపి 67.50 కోట్లు .. ఓవర్సీస్ 4.85 కోట్లు .. రెస్ట్ ఆఫ్ ఇండియా 4.55 కోట్లు వచ్చింది. ఇక ఫ్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్లకు పైగానే చేసింది . కాబట్టి సినిమా సక్సెస్ఫుల్గా నడిచిందని నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఓటిటి రైట్స్, శాటిలైట్ రైట్క్, యూట్యూబ్ రైట్స్, హిందీ రైట్స్ అదనం. వాటిద్వారా భారీగా నిర్మాతకు లాభం వస్తుంది. మొత్తాని పెట్టిన దానికి డబుల్ ప్రాఫిట్స్ రాబట్టుకున్నారు మేకర్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news