Moviesమెగా ఫ్యాన్స్ కు మరో తీపి కబురు..అభిమానులకు ఇంతకన్నా ఏం కావలి...

మెగా ఫ్యాన్స్ కు మరో తీపి కబురు..అభిమానులకు ఇంతకన్నా ఏం కావలి గురూ..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇదో ట్రెండ్ గా మారిపోయింది . గతంలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ 4క్ వర్షెన్ లో రిలీజ్ చేస్తూ అభిమానులకు కొత్త బూస్టప్ ఇస్తున్నారు ఈ క్రమంలోని టాలీవుడ్ లో ఉండే బడా బడా స్టార్ హీరో సినిమాలను మళ్లీ రిలీజ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలుచుకుంటున్నారు .

ఇప్పటికే పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , మహేష్ బాబు ఆ ఖాతాలో చేరిపోయారు . ఆ లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు మెగాస్టార్ చిరంజీవి . ఎందరో యువ నటీనటులకు స్ఫూర్తిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుంది అంటే జనాల్లో కొత్త తెలియని ఫీల్ . అలాంటిది ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఇచ్చిన సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంటే బాక్స్ ఆఫీస్ బద్దల అవ్వాల్సిందే .

ప్రజెంట్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు మెగా ఫాన్స్ . మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమాను మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు . ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ” చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో..రఫాడించేసాను” అంటూ మెగాస్టార్ చెప్పే మాస్ డైలాగ్ ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు భోళా శంకర్ టీం. టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్విట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news