Moviesమళ్లీ ఒక్కే బ్యూటీ తో రొమాన్స్ చేస్తున్న ఎన్టీఆర్-చరణ్.. ఆ డైరెక్టర్...

మళ్లీ ఒక్కే బ్యూటీ తో రొమాన్స్ చేస్తున్న ఎన్టీఆర్-చరణ్.. ఆ డైరెక్టర్ కావాలనే గీరుకుంటున్నాడా..?

తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో కొందరు డైరెక్టర్స్ కాంపిటీషన్ ఉన్న హీరోస్ కోసం ఒకే బ్యూటీని సెలెక్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు . మనకు తెలిసిందే రీసెంట్గా రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి – వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోయిన్ శృతిహాసన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉంటారు.

ఇద్దరు సినిమాలో ఒకే హీరోయిన్ తీసుకుని పక్కపక్క రోజుల్లోనే సినిమా రిలీజ్ చేయడం టఫ్ జాబ్ ..అయినా కాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఇద్దరు డైరెక్టర్స్ . కాగా మరోసారి అలాంటి సిచువేషన్ ఇండస్ట్రీలో రిపీట్ కాబోతుంది అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే ఆరారార్ సినిమాతో బిగ్గెస్ట్ విజయాని అందుకున్న తారక్-చరణ్.. ప్రజెంట్ వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు . ఈ క్రమంలోని ఆర్సి 15 సినిమాలో చరణ్ ..కొరటాల శివ సినిమాలో తారక్ భాగం కానున్నారు .

చరణ్ – ఎన్టీఆర్ మరోసారి ఒకే బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ ఎన్టీఆర్ 30 సినిమాలో సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో చరణ్ తర్వాతి ప్రాజెక్ట్ బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలోను మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొరటాల శివ ముందు మృణాల్ ని బుక్ చేసుకున్నారని ..ఆ తర్వాతే చరణ్ తో మృణాల్ నటిస్తే బాగుంటుంది అని బుచ్చిబాబు సన ఫిక్స్ అయ్యి.. అదే బ్యూటీ కోసం పాకులాడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకునే ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో కనిపిస్తే మాత్రం ఆమె కెరియర్ దశ తిరిగిపోయిందని అనే చెప్పాలి అంటున్నారు ఫాన్స్ .. చూద్దం మరి మృణాల్ ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news