Moviesవాల్తేరు వీరయ్య లో రవితేజ ప్లేస్ లో అనుకున్న మెగా హీరో...

వాల్తేరు వీరయ్య లో రవితేజ ప్లేస్ లో అనుకున్న మెగా హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య . ఈ సినిమాలో మళ్ళీ ఘరానా మొగుడు టైం చిరంజీవిని తెరపై చూడబోతున్నాం అంటూ ఇప్పటికే టాక్ వినిపిస్తుంది . సైలెంట్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. కాగా మొదటి నుంచి సినిమాపై నెగటివ్ ఇంపాక్ట్ ఉన్న జనాలను ట్రైలర్ పాజిటివ్ కామెంట్స్ చేయించింది .

మరీ ముఖ్యంగా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపిస్తూ ఉండటమే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.మనకు తెలిసిందే చిరంజీవితో ఆల్రెడీ రవితేజ స్క్రీన్ షేర్ చేసుకొని అన్నయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు . ఇప్పుడు మళ్లీ వాల్తేరు వీరయ్యతో రవితేజ – చిరంజీవి ఒకే స్క్రీన్ పై మెరవబోతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

అయితే ఇలాంటి టైం లోనే ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ అవుతుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ప్లేస్ లో అనుకున్న హీరో మెగా హీరో వరుణ్ తేజ్ అని.. అయితే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఇలా నటిస్తే జనాలు యాక్సెప్ట్ చేయలేరని ..అది ఆల్రెడీ బ్యాడ్ సెంటిమెంట్గా ఆచార్య తో ప్రూవ్ చేసిందని.. ఆ కారణంగానే వరుణ్ తేజ్ ఈ సినిమాలో చేయడానికి చిరంజీవి ఒప్పుకోలేదని ..అప్పుడు డైరెక్టర్ రవితేజ పేరు సజెస్ట్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. ఏది ఏమైనా క్లాస్ హీరో చిరంజీవి ..మాస్ హీరో రవితేజ ..క్లాస్ మాస్ మిక్స్ చేస్తే బాక్స్ ఆఫిస్ బద్ధలవ్వాల్సిందే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news