మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరోగా తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య . సైలెంట్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేస్తుంది . కెధరిన్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా మొదటి బొమ్మ పడగానే మూవీ బంపర్ హిట్ అంటూ రివ్యూ ఇచ్చేశారు . అంతేకాదు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు మాస్ హీరో రవితేజ.
సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని తానై కష్టపడుతూ కర్త – కర్మ – క్రియ గా.. సినిమాని వన్ మ్యాన్ ఆర్మీల నెట్టుకొచ్చాడు చిరంజీవి . ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మెగాస్టార్ చిరంజీవి మాస్ పర్ఫామెన్స్ అనే చెప్పాలి. ఎక్కడ కూడా తన ఎనర్జీ లెవెల్స్ ని తగ్గించకుండా ఈ వయసులోనూ కుర్ర హీరోలకి ధీటుగా తన సినిమాలో అన్ని ఎలివేషన్స్ ని చూపిస్తూ మెగా ఫాన్స్ ని ఎంటర్టైన్ చేశాడు .
అంతేకాదు రవితేజ – మెగాస్టార్ చిరంజీవి మధ్య వచ్చే డైలాగులు ఈ సినిమాలో బాగా హైలైట్ గా మారాయి. రవితేజ కూడా ఎక్కడ కూడా తగ్గెదేలే అన్న రేంజ్ లో విజృంభించేసాడు. ఈ సినిమాతో రవితేజ మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి . అయితే సినిమా ఫస్ట్ హాఫ్ లో కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది . కధ పరంగా బోరింగ్ గా ఉన్నా..రవితేజ-చిరు ఎంటర్ టైన్ చేయడానికి చాలా ట్రై చేసారు. చూడాలి మరి వాల్తేరు వీరయ్య ఏ రేంజ్ లో కలెషన్స్ తెచ్చిపెడుతుందో..?