Moviesవాల్తేరు వీరయ్య రివ్యూ: ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ హర్ట్.. బాబీ...

వాల్తేరు వీరయ్య రివ్యూ: ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ హర్ట్.. బాబీ నిద్రపోతున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సినిమా వాల్తేరు వీరయ్య . సంక్రాంతి కానుకగా నేడు థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా సినిమాలో రవితేజ – మెగాస్టార్ చిరంజీవి మధ్య పడ్డ సీన్లు సినిమాకి హైలెట్గా నిలిచాయి. అంతేకాదు చిరంజీవి తన వయసును మర్చిపోయి మరి ఈ సినిమా కోసం కష్టమైన స్టెప్స్ కూడా అవలీలగా వేసేయడం సినిమాని మరో మెట్టెక్కిచ్చాయి .

కాగా నటుల పరంగా సినిమాను పైకి తీసుకురావడానికి బాగా ట్రై చేశారు . అయితే కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. అంతేకాదు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ గా మారింది . చిరంజీవి రేంజ్ తో కంపేర్ చేస్తే దేవి మ్యూజిక్ దండగనే చెప్పాలి . జాతరలో కొన్న పీక తీసుకుని వచ్చి.. మెగాస్టార్ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఏంట్రా బాబు అంటూ డిసపాయింట్ అవుతున్నారు. బాబీ మ్యూజిక్ విన్నేటప్పుడు నిద్రపోతున్నాడా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

అంతేకాదు శృతిహాసన్ తో చిరంజీవి చేసిన రొమాన్స్..నడిపిన లవ్ ట్రాక్ ఆయన వయసుకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది . ఈ క్రమంలోనే కొంతమంది మెగా ఫ్యాన్స్ చిరంజీవి పెర్ఫార్మెన్స్ విషయంలో హ్యాపీగా ఉన్న బాబి డైరెక్షన్ విషయంలో హర్ట్ అవుతున్నారు. పెద్ద హీరో తో అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేకపోయావ్ అంటూ ఆయన ని టార్గెట్ చేస్తున్నారు. హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ తో కొన్ని నెగటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్య టాక్ వినిపిస్తుంది . చూడాలి మరి మొదటి రోజు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news