Movies"వాల్తేరు వీరయ్య" కు.."వీర సింహా రెడ్డి" కు..మధ్య ఉన్న బిగ్ డిఫరెన్స్...

“వాల్తేరు వీరయ్య” కు..”వీర సింహా రెడ్డి” కు..మధ్య ఉన్న బిగ్ డిఫరెన్స్ ఇదే..!!

ఈ సంక్రాంతి కి బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి ..జనవరి 12న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది . ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటలు కాకముందే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య కూడా థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్ పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్య – వీర సింహారెడ్డి సినిమాలో ఉన్న ప్లస్లు మైనస్ లు గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చను మొదలుపెట్టారు. అంతేకాదు వాల్తేరు వీరయ్య సినిమాలో ఉన్నది వీరసింహారెడ్డి సినిమాలో లేనిది ఇదే అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసింది గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య పవర్ఫుల్ ఫ్యాక్షన్ పాత్రలో కనిపించాడు . మొదటి నుంచి ఈ సినిమాలో బాలయ్య పాత్ర గురించి ఎక్స్పెక్ట్ చేసినట్లే డైరెక్టర్ గోపీచంద్ మలినేని డిజైన్ చేశాడు . అంతేకాదు వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్స్ కంటెంట్ చాలా తక్కువ .. సినిమా మొత్తం బాలకృష్ణనే కనిపిస్తాడు. కామెడీ అనేది పెద్దగా ఈ సినిమాలో లేదు. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే మాత్రం ఫ్యాక్షనిజం , పవర్ ఫుల్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ..అస్సలకి లేవు.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెగాస్టార్ చిరంజీవి మాస్ పెర్ఫార్మెన్స్ .. రవితేజ పవర్ఫుల్ పర్ఫామెన్స్ శృతిహాసన్, కేథరిన్ అందాల ప్రదర్శన హైలెట్గా మారింది .

మరీ ముఖ్యంగా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి – శృతిహాసన్ మధ్య వచ్చిన లవ్ రొమాంటిక్ సీన్స్.. సినిమాకు హైలెట్ గా మారాయి. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య కామెడీ కంటెంట్ ఎక్కువగా ఉందని జనాలు థియేటర్స్ కు వెళ్లి నవ్వుకోవచ్చు అని వీర సింహారెడ్డి సినిమా కోసం థియేటర్స్ కు వెళ్తే యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ చూసి ఎంజాయ్ చేయాలని ..సినిమాలో ఉన్న బిగ్ డిఫరెన్స్ ఇదే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రెండు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద దూసుకుపోతున్నాయి . చూడాలి మరి ఈ సంక్రాంతికి ఏ సినిమా ఎక్కువ రేంజ్ లో కలెక్షన్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద రియల్ సంక్రాంతి హీరోగా నిలబడతారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news