Moviesమహేశ్ బాబు కెరియర్ లోనే ఇది సంచలన రికార్డ్..SSMB28 నైజాం...

మహేశ్ బాబు కెరియర్ లోనే ఇది సంచలన రికార్డ్..SSMB28 నైజాం రైట్స్ ఆఫర్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..!!

ప్రజెంట్ ఘట్టమనేని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 . మహేష్ బాబు లాస్ట్ గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే . ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిపోయింది . కాగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎంతో ఇష్టంగా చేస్తున్న సినిమానే ఎస్ఎస్ఎంబి 28 . హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది.

Mahesh Babu to begin shooting for SSMB 28 on January 18, release date, cast & OTT platform announced

చాలా ఏళ్ల తరువాత మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాకు అర్జునుడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే – మహేష్ బాబుతో సెకండ్ టైం రొమాన్స్ చేయబోతుంది .

అంతేకాదు సినిమాలో సెకండ్ హీరోయిన్గా శ్రీ లీల సెలెక్ట్ అయినట్టు డైరెక్టర్ నాగవంశీ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇదే క్రమంలో ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఎస్ఎస్ఎంబి 28 కు నైజం రైట్స్ దిల్ రాజు ఏకంగా 50 కోట్లకు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది . ఇది మహేష్ బాబు కెరియర్ లోనే సంచలన రికార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

Mahesh Babu, మహేష్ బాబుకి దిల్ రాజు ఛాలెంజ్ - producer dil raju takes green india challenge and gives to mahesh babu - Samayam Telugu

మరో ప్రక్క ఏషియన్ సునీల్ సిండికేట్…48 కోట్లు ఆఫర్ చేసారని, నెగోషియేషన్స్ జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఎవరికి ఈ చిత్రం రైట్స్ వెళ్ళబోతున్నాయో మరికొద్ది రోజుల్లోనే తెలుస్తుంది . అయితే ముందు నుంచి అందరు అనుకున్నట్టు ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 11న విడుదల చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news