Moviesరవితేజ ఫేస్ కి అంత సీన్ ఉందా..? బయట పడ్ద స్టార్...

రవితేజ ఫేస్ కి అంత సీన్ ఉందా..? బయట పడ్ద స్టార్ హీరో నిజ స్వరూపం..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న మాస్ మహారాజ రవితేజకు ఉన్న క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకం అనే చెప్పాలి . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా ..అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి ..ఆ తర్వాత కమెడియన్ ..ఆ తర్వాత హీరోగా ..ఆ తర్వాత ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్నాడు . కాగా కెరియర్ మొదట్లో ఎటువంటి ఫ్లాప్స్ లేకుండా దూసుకుపోయిన రవితేజ ఆ తరువాత ఒకానోక టైం లో ఒక హిట్ కొట్టడానికి చాలా కష్టపడ్డాడు .

 

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . అయినా కానీ ఆయనకు అవకాశాలు తగ్గలేదు ఆయనలోని మాస్ యాంగిల్స్ ని విపరీతంగా ఇష్టపడే జనాలు రీసెంట్గా రిలీజ్ అయిన ధమాకా సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా మార్చేశారు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాసింది . యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజకు జోడిగా నటించింది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయింది . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్ హీరోస్ రవితేజ నిజంగానే వంద కోట్లు కలెక్ట్ చేశాడ..? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .

అయితే ఓ స్టార్ హీరో మాత్రం రవితేజ పై అక్కసు ని ప్రొడ్యూసర్స్ వద్ద బయటపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . నిజంగానే రవితేజ నటించిన ధమకా సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందా..? అంటూ ధమాకా సినిమా లెక్కలను అడిగి తెలుసుకున్నారట . రవితేజ ధమాకా సినిమా కేవలం 67 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని.. మిగతావి ఆయన చెప్పుకుంటున్న డబ్బా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు . అయితే రవితేజ ఫాన్స్ మాత్రం సదరు హీరోని తప్పుపడుతున్నారు. నువ్వంటే 100 కోట్ల క్లబ్ లోకి చేరలేదు .. మిగతా వాళ్ళు చేరలేరా ..? రవితేజ స్టామినా ముందు నీ పవర్ ఎంత అంటూ ఏకిపారేస్తున్నారు . అంతేకాదు సదరు స్టార్ హీరో రవితేజ ఫేస్ కి అంత సీన్ ఉందా అంటూ కూడా కామెంట్లు చేశాడట . ఇదే విషయం ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news