Moviesబిగ్ బ్రేకింగ్: మళ్ళీ విషమించిన తారకరత్న ఆరోగ్యం.. అభిమానుల్లో ఆందోళన..!!

బిగ్ బ్రేకింగ్: మళ్ళీ విషమించిన తారకరత్న ఆరోగ్యం.. అభిమానుల్లో ఆందోళన..!!

ఎస్ .. బెంగళూరు డాక్టర్లు మరోసారి నందమూరి తారకరత్న హెల్త్ బుల్లెట్ ను రిలీజ్ చేశారు . కాగా నందమూరి తారకరత్న ఆరోగ్యం పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు ప్రకటించడంతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు . మనకు తెలిసిందే నారా లోకేష్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న జనాల తాకిడికి తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే స్పృహ తప్పి పడిపోవడంతో కార్డియాటిక్ అరెస్ట్ రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు .

కుప్పంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో వెంటనే హుటాహుటిన బెంగళూరులోని హాస్పిటల్ కి ఆయన ను తరలించారు . ఈ క్రమంలోనే 24 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమన్న డాక్టర్లు ఆయన కండిషన్ అత్యంత క్రిటికల్ గా ఉంది అంటూ హెల్త్ బులిటిన్ రిలీజ్ చేశారు . ఈ క్రమంలోనే నందమూరి కుటుంబ సభ్యులందరూ ఆయనను చూడడానికి హాస్పిటల్ చేరుకున్నారు . దేవుడి దయ వల్ల ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని ..ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నాడని ..రామకృష్ణ చెప్పుకొచ్చాడు.

అయితే మళ్లీ నిన్న సాయంత్రం గా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుందని డాక్టర్స్ హెల్త్ బులిటినె రిలీజ్ చేశారు . తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నట్లు హెల్త్ బులిటిన్ లో పేర్కొన్నారు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు . దీంతో నందమూరి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news