Moviesఫైనల్లీ..నచ్చిన వ్యక్తిని పెళ్లాడబోతున్న సదా..మంచి సుండ్ పార్టీనే పట్టిందే..!?

ఫైనల్లీ..నచ్చిన వ్యక్తిని పెళ్లాడబోతున్న సదా..మంచి సుండ్ పార్టీనే పట్టిందే..!?

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ బడా సెలబ్రిటీస్ వరుసగా పెళ్లిళ్లు చూసుకుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు . ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మలు స్టార్ హీరోస్ వరుసగా తమ పెళ్ళి గుడ్ న్యూస్లను అందజేస్తూ సోషల్ మీడియాలో జనాలకు కొత్త ఫీలింగ్ ను కలగజేస్తున్నారు. రీసెంట్గా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న శ్రవానంద్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు .

రక్షిత రెడ్డితో వివాహానికి సంబంధించిన నిశ్చితార్ధపు వేడుకలను పూర్తి చేసుకొని తన కాబోయే భార్య ఫోటోను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు శర్వానంద్. కాగా అంతకుముందే నాగశౌర్య కూడా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిలైపోయాడు . ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ స్టార్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసుకున్న తరుణంలో హీరోయిన్ సదా కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . జయం సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన సదా ..మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది .

హీరోయిన్ సదా....హాట్ అండ్ సెక్సీ లుక్ (ఫోటోస్) | Actress Sada hot Photos -  Telugu Filmibeat

ఇక తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా వరుసగా సినిమాలకు కమిటీ అయ్యి తనదైన స్టైల్ లో దూసుకుపోయిన సదా ..ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ తో బిజీగా ఉంది. అయితే పెళ్ళి వయసు దాటిపోయిన సదా తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మనసుకు నచ్చిన వాడు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పిన సదా.. ఇంత త్వరగా తన పెళ్లి గుడ్ న్యూస్ ని జనాలకు చెప్తుందని ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో సదా పెళ్లి న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news