Moviesబాలయ్య పక్కన కత్తి లాంటి ఫిగర్.. అభిమానులకు ఈసారి మాస్ జాతరే..!!

బాలయ్య పక్కన కత్తి లాంటి ఫిగర్.. అభిమానులకు ఈసారి మాస్ జాతరే..!!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది . అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు “నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తాను” అనే డైలాగ్ బాలకృష్ణకు బాగా సరిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు క్రియేట్ చేయాలన్న..ఆ రికార్డులు బద్దలు కొట్టాలన్న బాలకృష్ణ తర్వాతే ఎవరైనా . రీసెంట్ గా ఆయన నటించిన వీర సింహారెడ్డి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే . గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 54 కోట్లు కలెక్ట్ చేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పింది.

ప్రజెంట్ బాలకృష్ణ – అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి ఎంత వీలైతే అంత త్వరగా అభిమానులు ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు బాలయ్య . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే ప్రియాంక జవాల్కర్ అనే పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. బాలయ్య కూతురుగా శ్రీలీల ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయింది . అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది .

కాగా ఈ సినిమాల్లో ఇప్పుడు బాలయ్యకు జోడిగా ఐటమ్ సాంగ్ లో నటించడానికి పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . ఆల్రెడీ ఎఫ్3 సినిమాల్లో పూజ హెగ్డే – అనిల్ రావిపూడి తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఐటమ్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే మళ్లీ అనిల్ రావిపూడి – పూజా హెగ్డే తన లక్కీ గర్ల్ గా మార్చుకొని బాలయ్యతో స్టెప్స్ వేయడానికి ఒప్పించాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మాస్ ఇండస్ట్రీ ని మాస్ యాంగిల్ లో అదర కొట్టే బాలయ్య ఎటువంటి యాంగిల్ లోనైన హిట్ పుట్టించే పూజ హెగ్డే కలిస్తే రచ్చ రంబోలా అంటున్నారు ఫాన్స్ . చూడాలి మరి ఈ కాంబో ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news