Moviesదరిద్రం వదిలిపోయింది .. దీప్తి సునైన పై షణ్ముఖ్ షాకింగ్ పోస్ట్..!!

దరిద్రం వదిలిపోయింది .. దీప్తి సునైన పై షణ్ముఖ్ షాకింగ్ పోస్ట్..!!

షణ్ముఖ్ జస్వంత్ .. ఇప్పుడంటే ఈ పేరుకి రేంజ్ క్రేజ్ తగ్గింది .. కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే సినిమా స్టార్స్ కన్నా ఎక్కువ రేంజ్ లో జనాలు ఊగిపోయే వాళ్ళు . కేకలు పెట్టే వాళ్ళు ..షన్ను షన్ను సహ్న్ను అంటూ ఎగబడేవారు. ఇప్పుడు ఆ షన్ను కాస్త జీరో అయ్యాడు . దానికి రీజన్ బిగ్ బాస్ అని అందరికీ తెలిసిందే . సోషల్ మీడియా ద్వారా తనకున్న టాలెంట్ను నలుగురికి పరిచయం చేసి నెంబర్ వన్ యూట్యూబర్ గా రాజ్యమేలుస్తున్న షణ్ముఖ్ జస్వంత్ ..ఎవరు ఊహించిన విధంగా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి ..తోటి కంటెస్టెంట్ సిరితో నడిపిన ఫ్రెండ్షిప్ కానీ ఫ్రెండ్షిప్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే .

 

పైకి ఫ్రెండ్షిప్ అంటూ చెప్పుకొస్తూనే ఆ హగ్గులు ఆ ముద్దులు చూసిన జనాలు వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఫిక్స్ అయిపోయారు . బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు చేస్తున్న చిలిపి సరసాలను తన హౌస్ లో ఉండి టీవీలో చూసిన బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ యశ్వంత్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైన.. అతగాడికి హౌస్ నుంచి రాగానే బ్రేకప్ చెప్పేసింది . ఆ దెబ్బతో దరిద్రం వదిలిపోతుంది అంటూ దీప్తి సునైన షణ్ముఖ్ పేర్లు కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయాయి.

కాగా ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ జంట కలవబోతున్నారు అని అనుకుంటున్న జనాలకు మరో బిగ్ బాంబ్ పేల్చాడు షన్ను. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టుకోవచ్చాడు . ఈ పోస్ట్ చూసిన జనాలు దీప్తి సునయన కు సంబంధించి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . రీసెంట్ గా రిలీజ్ అయిన లవ్ టు డే సినిమాలో రెవి క్యారెక్టర్ ఎంతో పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ పేరు ని ఉద్దేశించి..షన్ను షాకింగ్ పోస్ట్ పెట్టాడు.

“500, 1000 నోట్లను బ్యాన్ చేసిన్నట్లే..అమ్మాయిలు తమ లైఫ్ లో రెవి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిలని బ్యాన్ చేయాలి ..అలాంటి వ్యక్తిని దూరం పెడితేనే మంచిది ” అంటూ చెప్పుకొచ్చాడు. మనకు తెలిసిందే ఈ మధ్య కాలంలో దీప్తి సునయన ఓ వ్యక్తితో చాలా క్లోజ్ గా ఉంది . ఈ క్రమంలోనే పరోక్షకంగా దీప్తికి కౌంటర్ వేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . చూడాలి మరి దీనిపై దీప్తి ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news