Movies"చేతులకి గాజులు వేసుకుని మూల కూర్చోవాలా".. సమంత సంచలన పోస్ట్ వైరల్..!!

“చేతులకి గాజులు వేసుకుని మూల కూర్చోవాలా”.. సమంత సంచలన పోస్ట్ వైరల్..!!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సౌత్ లో వన్ అండ్ ఓన్లీ లేడీస్ సూపర్ స్టార్ గా రాజ్యమేలేస్తుంది . ఎంతోమంది అందాల ముద్దుగుమ్మలు ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీలో నయనతార లాంటి హీరోయిన్ ఉండడం నిజంగా చాలా గ్రేట్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్. అంతేకాదు నయనతార గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ కూడా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా వినిపిస్తుంది.

రీసెంట్గా నయనతార నటించిన కనెక్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కంటెంట్ లేకపోవడంతో జనాలకు ఈ సినిమా కనెక్ట్ అవ్వలేదు. ఆ కారణంగానే సినిమా డిజాస్టర్ గా మారింది. అయితే నయనతార పర్ఫామెన్స్ కి మాత్రం మంచి రివ్యూ వచ్చాయి. ఇదే క్రమంలో నయనతార సినిమాకి సంబంధించిన హోర్డింగ్లను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు మేకర్స్ . ఈ క్రమంలోని నయనతార ఫ్యాన్ ఆ హోర్డింగ్ లను పోస్ట్ చేస్తూ ..”పదేళ్ల క్రితం ఈ పరిస్థితి హీరోయిన్లకు లేదు ..ఇప్పుడు స్టార్ హీరోయిన్ చిత్రాలు సింగిల్ గా వస్తున్నాయి” అంటూ కామెంట్ చేసింది.

ఇదే పోస్ట్ ను ఫొటోస్ ను ట్యాగ్ చేస్తూ సమంత మహిళలు ఎదుగుతున్నారు అంటూ కామెంట్ పెట్టింది . ఈ క్రమంలోని సమంత – నాగచైతన్యకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటిలాగా అమ్మాయిలు చేతికి గాజులు వేసుకుని కూర్చోవట్లేదని అన్ని రంగాల్లో ముందుకు రానిస్తున్నారని అమ్మాయిలు కూడా సమంత పోస్టుకు కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news