Moviesబాహుబ‌లి మైండ్ బ్లాక్ అయ్యేలా ' ప్రాజెక్ట్ K ' బిజినెస్‌......

బాహుబ‌లి మైండ్ బ్లాక్ అయ్యేలా ‘ ప్రాజెక్ట్ K ‘ బిజినెస్‌… లెక్క‌లు చూస్తేనే క‌ళ్లు జిగేల్‌…!

బాహుబలి సీరిస్ సినిమాల‌తో యంగ్‌రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ క్రేజ్ ఎంత‌లా పెరిగిపోయిందో చూస్తూనే ఉన్నాం. బాహుబ‌లి 1, బాహుబ‌లి 2, ఆ త‌ర్వాత రాధేశ్యామ్‌, సాహో సినిమాలు కూడా పాన్ ఇండియా లెవ‌ల్లోనే రిలీజ్ అయ్యాయి. ఇక త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఆదిపురుష్ బాలీవుడ్ ద‌ర్శ‌కుడి ప్రాజెక్టే. ఈ సినిమాపై కూడా నేష‌న‌ల్ లెవ‌ల్లో అంచ‌నాలు ఉన్నాయి. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమా సైతం పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తోంది.

అస‌లు కేజీయ‌ఫ్ 2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ చేసిన సినిమా కావ‌డం.. ఆ సినిమా సాధించిన సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత స‌లార్ వ‌స్తుండ‌డంతో స‌లార్‌పై క్రేజ్ అయితే ఓ రేంజ్‌లో ఉంది. ఆదిపురుష్‌, స‌లార్ సినిమాల మ‌ధ్య‌లోనే ప్ర‌భాస్ న‌టిస్తోన్న మ‌రో సినిమా ప్రాజెక్ట్ కే. మ‌హాన‌టి త‌ర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో చెప్పేందుకు ఆ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ నిద‌ర్శ‌నం.

మ‌హాన‌టి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత అశ్వనీద‌త్ అల్లుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్కిస్తున్నారు. రు. 500 కోట్ల బ‌ట్జెట్‌తో ప్రాజెక్ట్ కె తెర‌కెక్కుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ టైం మ‌రోయేడాది ప‌ట్ట‌నుంది. 2024లోనే ప్రాజెక్ట్ కే రిలీజ్ కానుంది. ఈ లోగా స‌లార్ రెండు పార్ట్‌లు, ఆదిపురుష్ కూడా రిలీజ్ కావాలి. ఆ త‌ర్వాత ప్రాజెక్ట్ కే దిగుతుంది. ప్రాజెక్ట్ కె త‌ర్వాత పీపుల్స్ మీడియా సంస్థ సినిమా ఉంటుంది.

ఇక ప్రాజెక్ట్ రిలీజ్ టైం మ‌రో యేడాది ఉండ‌గానే.. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ నైజాం ఏరియా వ‌ర‌కే రు. 70 కోట్లు ప‌లుకుతోంది. నైజాం డీల్ ఆ అమౌంట్‌కు క్లోజ్ అయిపోయిన‌ట్టుగా కూడా తెలుస్తోంది. ఏసియ‌న్ సునీల్ ఈ రైట్స్ సొంతం చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఏసియ‌న్‌లో సునీల్‌తో పాటు మ‌రో అగ్ర నిర్మాత సురేష్‌బాబు కూడా ఉన్నారు. గ‌తేడాది ఈ పంపిణీ సంస్థ నుంచే సీతారామం, కార్తికేయ‌ 2, ధమాకా లాంటి బ్లాక్ బస్టర్లు వ‌చ్చాయి.

 

ఒక్క నైజాంలోనే రు. 70 కోట్లు రేటు ప‌లికిందంటే ఇక ఆంధ్రా, సీడెడ్‌, ఓవ‌ర్సీస్ రైట్స్ ఏ రేషియోలో ఉంటాయో కూడా ఊహ‌కే అంద‌డం లేదు. ఏదేమైనా ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నా.. ప్రాజెక్ట్ కే, స‌లార్ మీదే భారీ అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news