Moviesపుజా హెగ్డే ఇంట పెళ్లి సంబరాలు..సైలెంట్ షాకిచ్చిన బుట్టబొమ్మ..!!

పుజా హెగ్డే ఇంట పెళ్లి సంబరాలు..సైలెంట్ షాకిచ్చిన బుట్టబొమ్మ..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మ గా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ..ప్రజెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో హ్యూజ్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ హాట్ ఫిగర్ అంటూ ట్యాగ్ చేయించుకుంది. నిజానికి పూజ హెగ్డే కెరియర్ ఎప్పుడో ప్రారంభమైంది.

అయితే మొదటి హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకుంది. ఆ తర్వాత ఫస్ట్ హిట్ అందుకున్న పూజ హెగ్డే తర్వాత వరుసగా తన ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను వేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే పూజ హెగ్డే తన ఆశలన్నీ ఎస్ ఎస్ ఎం బీ 28 పైనే పెట్టుకుంది. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్త్దాత్ భగత్ సింగ్ లో కూడా హీరోయిన్గా నటిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే పూజా హెగ్డే ఫుల్ జోష్ తో సంబరాలు చేసుకుంటుంది .

తన అన్న పెళ్లి వేడుకకు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే సోదరుడురిషబ్‌ హెగ్డే పెళ్లి ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. శివానీశెట్టి అనే అమ్మాయిని రిషబ్‌ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించి అన్నీ తానై చూసుకుంది పూజా.సొంత బ్రదర్‌ కావడంతో ఓ రకంగా పెద్దగా వ్యవహరించిందని చెప్పొచ్చు. వారం రోజులపాటు ఆ పెళ్లి వేడుకులో మునిగి తేలింది. ఈ పెళ్లికి సంబంధించిన అన్ని పనులను దగ్గర నుండి చూసుకున్న పూజ హెగ్డే రీసెంట్గా పెళ్లికి సంబంధించిన పిక్స్ షేర్ చేసుకుంది.

పట్టు వస్త్రాలలో పూజ హెగ్డే అచ్చం బుట్ట బొమ్మలానే ఉంది . చాలా ట్రెడిషనల్ గా .. చాలా క్యూట్గా అందరినీ ఆకట్టుకుంటుంది . ఇదే క్రమంలో పూజా హెగ్డే పెళ్లెప్పుడు అంటున్న వార్త కూడా వైరల్ అవుతుంది . మరికొందరు పూజ హెగ్డే తన చిన్ననాటి ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉందని త్వరలోనే ఆమె తనని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news