Moviesహీరోయిన్స్ కి 90MM రాడ్ దించేసిన కృతిశెట్టి.. ఒక్క దెబ్బ తో...

హీరోయిన్స్ కి 90MM రాడ్ దించేసిన కృతిశెట్టి.. ఒక్క దెబ్బ తో టాప్ ప్లేస్ లోకి బేబమ్మ..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కాదు ..వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకొని తద్వారా అవకాశాలతో మరో 10 అవకాశాలు సంపాదించుకోవడమే ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ చేయాల్సిన పని . అయితే తలరాతో లేక టైం బాగాలేదో తెలియదు కానీ ..అందం , నటన ..టాలెంట్ అన్ని ఉన్నా కానీ కొందరు హీరోయిన్స్ తప్పుడు నిర్ణయాలు తీసుకుని కెరియర్లో బిగ్గెస్ట్ రాంగ్ స్టెప్స్ వేస్తుంటారు . అలాంటి తప్పే చేసి కృతి శెట్టి ఇండస్ట్రీలో ట్రోలింగ్ కి గురవుతుంది .

మనకు తెలిసిందే ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేనా ఆ తర్వాత నటించే రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి . అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా తర్వాత నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారడంతో కృతి శెట్టి ఎంత త్వరగా కెరీర్ గ్రాఫ్ పెంచుకున్నిందో.. అంతే త్వరగా డిజాస్టర్ గా డౌన్ అయింది .

ఈ క్రమంలోనే తన అభిమానులకు తన పేరును గుర్తుండేలా కృతిశెట్టి ఏ హీరోయిన్ చేయని పని చేసింది . సోషల్ మీడియాలో తన పేరుతో ఫ్యాన్ పేజ్ రన్ చేస్తున్న ఫ్యాన్స్ ని స్వయంగా మీట్ అయి ..వాళ్లకి కొత్త బూస్ట్ అప్ ఇచ్చింది . ఎవరైనా హీరోయిన్ మనకు మెసేజ్ పెడితేనే ఊగిపోయే కుర్రాళ్ళు.. తామెంతో ప్రాణంగా భావించే సొంత హీరోయిన్ ఇలా మీట్ ఏర్పాటు చేస్తే ఆ ఫ్యాన్స్ ఊరుకుంటారా ..? రచ్చ రంబోలా చేసేస్తారు. దీంతో కృత శెట్టి పేరుని ఆమె ఫొటోస్ ని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. చాలా సైలెంట్ గా హైదరాబాద్ లో తన ఫాన్స్ తో మీట్ అయి మిగతా హీరోయిన్స్ కి బిగ్ షాక్ ఇచ్చింది కృతి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news