Moviesవామ్మో..ఈ హనీరోజ్ మామూల్ది కాదు గా.. బాలయ్యకే అన్ని కండీషన్స్ పెట్టిందా..?

వామ్మో..ఈ హనీరోజ్ మామూల్ది కాదు గా.. బాలయ్యకే అన్ని కండీషన్స్ పెట్టిందా..?

హనీ రోజ్ నిన్న మొన్నటి వరకు ఈ పేరు తెలుగు జనాలకు పెద్దగా పరిచయం లేదు . కానీ నందమూరి నటసింహం బాలయ్య హీరోగా తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది అని తెలియగానే అందరి అటెన్షన్ ఆమె వైపు మళ్ళింది . అంతేకాదు రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా శృతిహాసన్ కన్నా మించిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసి సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది ఈ హనీ రోజ్. ఈ క్రమంలోని ఎవరు ఈ హనీ రోజు అనే చర్చ ఇంట్రెస్టింగ్ గా మారింది .

కాగా ఈమె ఓ మలయాళీ హీరోయిన్ . కేరళలో పుట్టి పెరిగిన హనీ రోజ్ అక్కడ పలు సినిమాలతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు మలయాళీ మెగాస్టార్ అంటూ పేరు సంపాదించుకున్న మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించి అలరించి మెప్పించింది ఈ హనీ రోజ్. కాగా అప్పుడెప్పుడో 2005వ సంవత్సరంలోనే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ హనీ రోజ్ నటనకు సంబంధించిన పాత్రనే కాదు బోల్డ్ గా ఉండే రోల్స్ లో కూడా నటించి మెప్పించగలరు .

కాగా రీసెంట్గా వీరసింహారెడ్డి సినిమాలో నటించి ఈ బ్యూటీ ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమా కోసం హనీ రోజ్ డైరెక్టర్ కు స్పెషల్ కండీషన్ పెట్టిందట. బాలయ్యతో నటించడానికి హనీ రోజ్ గోపీచంద్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఓ కండిషన్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కేరళా లో పుట్టి పెరిగినా తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమైన ఈ బ్యూటీ కిబాలయ్య అంటే ఎప్పటినుంచో ఇష్టమని .. ఆయనతో నటించాలని కోరుకుంటున్నానని,, ఈ సినిమా కోసం బాలయ్యతో ఎక్కువ సీన్లు ఉండేలా ప్లాన్ చేయమని డైరెక్టర్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిందట .

ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని .. ఆయనతో కోంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేలా స్క్రీన్ టైమింగ్ పెంచమని గోపీచంద్ ని రిక్వెస్ట్ చేసిందట . కాగా కచ్చితంగా ఈ సినిమాతో హనీ రోజ్ తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . చూడాలి మరి వీర సింహారెడ్డి సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news