Moviesశాకుంతలం సినిమాలో సమంత కట్టిన ఈ చీర ఎన్ని కేజీలో తెలుసా..?...

శాకుంతలం సినిమాలో సమంత కట్టిన ఈ చీర ఎన్ని కేజీలో తెలుసా..? అంత చరిత్ర ఉందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “శాకుంతలం”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే చిత్రం నుండి రిలీజ్ అయిన పాటలు , ట్రైలర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది . మరి ముఖ్యంగా ఈ సినిమాలో సమంతాను మనం ఓ సరికొత్త లుక్ లో చూడబోతున్నాం.

కాగా ఈ సినిమాలో దుష్యంతుడు పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు . శకుంతలా దేవి పాత్రలో అందాల ముద్దుగుమ్మ సమంత నటించిన ఈ సినిమాలో కాస్టూమ్స్ కోసం గుణశేఖర్ ప్రత్యేకంగా కేర్ తీసుకొని మరి సెర్చ్ చేసి డిజైన్ చేయించారట . ఈ క్రమంలోనే సమంత కట్టుకున్న ఈ చీర స్పెషాలిటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో సమంత గ్రాండ్ లుక్ లో చూపించడం కొసం డైరెక్టర్ చాలా కష్టపడ్డారట.

సమంతను ప్రతి ఫ్రేమ్లో యువరాణిలా కనిపించేందుకు మూడు కోట్ల రూపాయలకు పైగానే విలువైన ఒరిజినల్ డైమండ్స్ నగలను ఉపయోగించారట . ఈ నగలను నేహా అనుములు డిజైన్ చేసినట్లు తెలుస్తుంది . ఇక ఒరిజినల్ ముత్యాలు పొదిగిన చీరనే సమంత కట్టుకున్నారట . ఈ చీర దాదాపు 30 కేజీల బరువు పైనే ఉంది అన్నట్లు సమాచారం . ఈ చీర కట్టుకొని ఆమె ఏడు రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నారు . తెలుగు – తమిళం- కన్నడ మలయాళం- హిందీ భాషలలో ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతుంది . ఏది ఏమైనా సరే సమంత ఈ సినిమాకు పెట్టిన ఎఫర్ట్స్ కచ్చితంగా ఆమెకు సక్సెస్ అందిస్తుంది అంటున్నారు మేకర్స్ . ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news