Moviesబిగ్ బ్రేకింగ్: బిగ్ బాస్ సీజన్ 7 వచ్చేస్తుందోచ్.. హోస్ట్ తోనే...

బిగ్ బ్రేకింగ్: బిగ్ బాస్ సీజన్ 7 వచ్చేస్తుందోచ్.. హోస్ట్ తోనే పిచ్చెక్కించేసారుగా..!!

వావ్ ..ఇది నిజంగా అభిమానులకు గుడ్ న్యూసే. తెలుగు టెలివిజన్ లోనే అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్.. ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. కాగా రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే బిగ్ బాస్ అంటే జనాలకు ఎంతో ఇష్టం . బిగ్ బాస్ షో పై కాంట్రవర్షల్ కామెంట్స్ చేసే జనాలే . ఆ షో టైమింగ్ వస్తే ఇంట్లో టీవీకి అతుక్కుపోయి మరి చూస్తుంటారు .

ఎన్ని బూతులు తిట్టినా సరే బిగ్ బాస్ లో క్రియేట్ అయ్యే కాంట్రవర్సీ కోసం జనాలు ఎగబడి మరి ఈ షో ని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోని మొదటి నుంచి టిఆర్పి రేటింగ్స్ డౌన్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ ..లాస్ట్ లో హై రేంజ్ లో రికార్డ్ నెలకొల్పింది. బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్, సీజన్ 2 కి హోస్టుగా చేసిన నాని ఎలాంటి క్రేజీ రికార్డులు నెలకొల్పారో తెలిసిందే. అయితే బిగ్బాస్ సీజన్ 3 నుంచి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి మాత్రం చేయడం లేదని చెప్పేసారట.

ఈ క్రమంలోనే హోస్ట్గా టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కండల వీరుడు రానా దగ్గుబాటి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది . ఇప్పటికే హోస్ట్ గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న రానా ..బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్ట్ గా చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే షూట్ డేట్ కూడా ఫిక్స్ చేశారట. ఏది ఏమైనా సరే ఆరు అడుగుల అందగాడు హోస్ట్ గా చేస్తే..ఆ హైట్ తోనే పిచ్చెక్కించేస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news