Moviesవాళ్లిద్దరి కంటే ఆమె ఎక్కువ ఇష్టం.. బాలయ్య మహా రొమాంటిక్ రా...

వాళ్లిద్దరి కంటే ఆమె ఎక్కువ ఇష్టం.. బాలయ్య మహా రొమాంటిక్ రా బాబోయ్..!!

టాలీవుడ్ నందమూరి నరసిం హం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో డేర్ గల హీరోలు చాలా తక్కువ . మెప్పుకోసం ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ఇష్టం లేకపోయినా సరే నవ్వుతూ పలకరించే హీరోలు మన ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు . అయితే వాళ్లందరిలోకి ప్రత్యేకం బాలకృష్ణ . నచ్చితే శభాష్ అంటూ మెచ్చుకునే ఆ చేతులే .. తప్పు చేస్తే తాట తీసేస్తుంది . అందుకే నందమూరి బాలయ్య తో సినిమా చేయాలి అన్నా.. మాట్లాడాలి అన్నా..చాలా డేర్ ఉండాలి అంటుంటారు సినిమా ప్రముఖులు .

కాగా రీసెంట్గా నందమూరి బాలయ్య హీరోగా నటించిన చిత్రం ” వీరసింహారెడ్డి “. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర మేకర్స్ ప్రకటించారు . కాగా ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ మొదటి హీరోయిన్గా నటిస్తుండగా.. రెండో హీరోయిన్గా మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ నటిస్తుంది . ఈ సినిమా మరో 48 గంటల్లో థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు వీర సింహారెడ్డి టీం. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనను ఆహా రిలీజ్ చేసింది .

వాళ్లు షోకి వచ్చిన కొన్ని ఫొటోస్ ని అఫీషియల్ ఖాతాలో రిలీజ్ చేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. షోలో గోపీచంద్ మలినేని బాలయ్యను “ఈ సినిమాల్లో మీతో నటించిన హీరోయిన్స్ శృతిహాసన్, హనీ రోజ్ లో ఎవరంటే మీకు బాగా ఇష్టం..? ఎవరితో మీరు బాగా కనెక్ట్ అయ్యారు..?” అని అడిగారట . ఇదే క్రమంలో బాలయ్య తనలోని చిలిపి బాలయ్యను బయటికితీస్తూ ..”శృతిహాసన్ తో క్లాస్ .. హనీ తో మాస్ ..కానీ వాళ్ళిద్దరి కంటే వరలక్ష్మీ లో ని విలనిజం బాగా నచ్చేసింది “అంటూ పక్కనే ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ ను ఓ రేంజ్ లో పొగిడేసారట. ఈ క్రమంలోనే అక్కడున్న జనాభా చప్పట్లతో జై బాలయ్య అంటూ హోరెత్తించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news