Movies62 ఏళ్ల న‌రేష్ 3 పెళ్లిళ్ల‌లో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా... ప‌విత్ర‌కూ...

62 ఏళ్ల న‌రేష్ 3 పెళ్లిళ్ల‌లో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా… ప‌విత్ర‌కూ న‌రేష్ మూడో భ‌ర్తే…!

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్, సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్రా లోకేష్‌తో నాలుగో పెళ్లికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా న‌రేష్‌, ప‌విత్ర‌కు లిప్‌కిస్ ఇస్తూ ఓ వీడియో రూపంలో తెలియ‌జేశాడు. దీంతో వ‌చ్చే యేడాదిలో వీరిద్ద‌రు స‌రికొత్త వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నార‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. అయితే న‌రేష్‌కు ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఈ పెళ్లిళ్ల మ్యాట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మ‌రోసారి వైర‌ల్ అవుతోంది.

 

న‌రేష్‌కు ముందుగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్రీనివాస్ కుమార్తెతో పెళ్లి జ‌రిగింది. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో హీరోగా ప‌రిచ‌యం అయిన న‌వీన్ విజ‌య్‌కృష్ణ ఈ దంప‌తుల కుమారుడే. ఈ పెళ్లి జ‌రిగేట‌ప్ప‌ట‌కి న‌రేష్ వ‌య‌స్సు కేవ‌లం 19. అయితే న‌రేష్ సినిమాల‌పై పూర్తిగా ఫోక‌స్ పెట్టారు. అప్ప‌ట్లో హీరోగా మంచి సినిమాలు చేశారు. కెరీర్‌పై కాన్‌సంట్రేష‌న్ చేసి.. వ్య‌క్తిగ‌త జీవితానికి స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంతోనే మొద‌టి భార్య‌కు న‌రేష్ విడాకులు ఇచ్చాడు.

అయితే ఆమెతో ఇత‌ర స్ప‌ర్థ‌లు ఏమీ లేవ‌ని టాక్ ? ఇప్ప‌ట‌కీ ఆమె, న‌రేష్ స్నేహితుల్లాగానే ఉంటారు. వీరి కుమారుడు న‌వీన్‌ను హీరోగా నిల‌బెట్టేందుకు న‌రేష్ ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో పాటు త‌న కుమారుడిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. ఆ త‌ర్వాత ప్ర‌ముఖ ర‌చ‌యిత దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి మ‌న‌వ‌రాలు రేఖా సుప్రియ‌ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. అయితే వీరి బంధం కూడా త్వ‌ర‌గానే ముగిసిపోయింది.

న‌రేష్ రేఖా సుప్రియ‌కు కూడా విడాకులు ఇచ్చేశాడు. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు రాజ‌కీయాల వైపు మ‌ళ్లాడు. కొన్ని సేవా కార్య‌క్ర‌మాలు చేశాడు. సినిమాల‌లో న‌టిస్తోన్న టైంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న ర‌మ్య ర‌ఘుప‌తితో ప్రేమ‌లో ప‌డి మూడో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెతో బంధం కూడా ఆరేడేళ్ల‌కు మించి నిల‌వ‌లేదు. అయితే ర‌మ్య‌తో కూడా న‌రేష్ ఓ కొడుకును క‌న్నాడు.

ఆమెతో స్ప‌ర్థ‌ల్లో ఉన్న‌ప్పుడే ప‌విత్రా లోకేష్‌తో న‌రేష్ స‌హ‌జీవ‌నం ప్రారంభించేశాడు. న‌రేష్‌, ప‌విత్ర కూడా దాదాపు క‌రోనా టైం నుంచే క‌లిసే ఉంటున్నారు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఒక్క‌టి కాబోతున్నారు. అటు ప‌విత్ర‌కు కూడా ఇది మూడో పెళ్లి అని టాక్ ? ముందుగా ఆమె సినిమాల్లో ఉన్న‌ప్పుడే కుటుంబ స‌భ్యులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌తో పెళ్లి చేశారు. అయితే యేడాదిలోగానే ఆ బంధం విచ్ఛిన్న‌మైంది.

త‌ర్వాత సీరియ‌ల్స్‌లో క‌లిసి న‌టిస్తోన్న టైంలో త‌న కోస్టార్ సుచేంద్ర ప్ర‌సాద్‌తో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకుని అత‌డితో ఇద్ద‌రు అబ్బాయిల‌కు త‌ల్లి అయిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌విత్ర వ‌య‌స్సు 43. న‌రేష్ వ‌య‌స్సు 62. ఇద్ద‌రి మ‌ధ్య దాదాపుగా 20 ఏళ్ల వ్య‌త్యాసం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news