Moviesఛీ ఛీ సూర్య హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్.. అందరి...

ఛీ ఛీ సూర్య హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్.. అందరి ముందే అక్కడ పట్టుకుని లాగి..!!

ఈ మధ్యకాలంలో అభిమానం అనే పేరుతో కొందరు జనాలు రెచ్చిపోయి మరి ప్రవర్తిస్తున్నారు . సోషల్ మీడియాలో కూడా మేము పలానా హీరో హీరోయిన్ ఫాన్స్ అంటూ సొంత స్టార్ హీరో హీరోయిన్స్ ని కూడా ట్రోలింగ్ చేయడం మనం గమనించవచ్చు. అలాంటి దొంగ అభిమాని వల్గర్ చేష్టలకు ఇబ్బంది పడింది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అపర్ణ బాలమురళి .

Aparna Balamurali

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన “ఆకాశమే నీ హద్దురా” అనే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయిన అపర్ణ బాలమురళి . ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్ట్ కూడా అందుకుంది . అంతేకాదు ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వచ్చిన ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్న అపర్ణ బాలమురళి.. రీసెంట్గా “తంకమ్” అనే చిత్రంలో నటిస్తుంది . ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతున్న మూమెంట్ ళొ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు .

ప్రమోషన్స్ లో భాగంగా “తంకమ్” మూవీ టీం కేరళలోని ఓ కాలేజీలో సందడి చేశారు . అయితే ఓ విద్యార్థి వేదిక పైకి వచ్చి అపర్ణతో అనూహ్యంగా అసభ్యంగా ప్రవర్తించడం అక్కడి స్టూడెంట్స్ కి జనాలకు షాకింగ్ గా అనిపించింది . ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేదిక పైకి ఊహించిన విధంగా వచ్చిన విద్యార్థి అపర్ణ చేయి పట్టుకొని లాగి .. తర్వాత ఫోటో కోసం ఇబ్బంది పెట్టాడు . అంతేనా అక్కడితో ఆగకుండా ఏకంగా అందరి ముందే ఆమె భుజాలపై చేయి వేయడానికి ట్రై చేసాడు..దీంతో అపర్ణ బాలమురళి ఇబ్బంది పడుతూనే అతగాడి నుంచి సునాయాసంగా తప్పించుకునింది . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news