Moviesశాకుంతలం సినిమాలో అల్లు అర్హా క్యారెక్టర్ లో .. మొదట అనుకున్న...

శాకుంతలం సినిమాలో అల్లు అర్హా క్యారెక్టర్ లో .. మొదట అనుకున్న స్టార్ కిడ్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి తెరకెక్కిన సినిమా “శాకుంతలం”. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమంత ఈ సినిమా కోసం ఆరోగ్యం బాగా లేకపోయినా ప్రమోషన్స్ కి సిద్ధపడింది . రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలో దుశ్యంతుడు-శకుంతల మధ్య జరిగిన సన్నివేశాలను క్లియర్గా జనాలకు అర్థమయ్యే విధంగా చూపించాడు డైరెక్టర్ గుణశేఖర్.

Shaakuntalam Trailer: Samantha looks ethereal, Allu Arjun daughter Arha  makes a cameo appearance | Bollywood Bubble

ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడు పాత్రలో కనిపించి మెప్పించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో భరతుడి పాత్రలో కనిపించబోతుంది అల్లు అర్హ . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు. అయితే ఈ సినిమాలో మొదటి అల్లు అర్హ క్యారెక్టర్ కి మరో స్టార్ హీరో సన్ ని అనుకున్నారట . అతడు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ కొడుకు .

Happy Birthday Jr NTR: Adorable photos of RRR actor with wife Lakshmi  Pranathi, sons Abhay Ram-Bhargava Ram

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కొడుకుని ఈ రోల్ లో చూపించడానికి తారక్ ని అప్రోచ్ అయ్యారట గుణశేఖర్. అయితే కొడుకు అప్పుడే ఇండస్ట్రీలో అడుగు అడుగుపెట్టడం ఇష్టం లేని ఎన్టీఆర్ ..ఈ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేశారట . ఒకవేళ ఎన్టీఆర్ ఒప్పుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ పాత్రలో ముందు ఎన్టీఆర్ కొడుకుని సెట్ చేసే వారట, తారక్ ఒప్పుకోకపోవడంతోనే ఆ పాత్ర అర్హా వరకు వెళ్లిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news