Movies50 ఏళ్ల ఎన్టీఆర్‌తో 18 ఏళ్ల జ‌య‌సుధ రొమాన్స్‌.. తెర‌వెనక‌ ఇంత...

50 ఏళ్ల ఎన్టీఆర్‌తో 18 ఏళ్ల జ‌య‌సుధ రొమాన్స్‌.. తెర‌వెనక‌ ఇంత జ‌రిగిందా..!

తెలుగు సినీరంగంలో మకుటాయ‌మానంగా విరాజిల్లిన అన్న‌గారు ఎన్టీఆర్‌.. అనేక సినిమాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. కొన్నాళ్ల‌కు.. అన్న‌గారు లావెక్కారు. ముఖ్యంగా పొట్ట క‌నిపించేది. అప్ప‌ట్లో ఎక్స‌ర్ సైజ్‌లు చేసినా.. చాలా సినిమాల్లో దీనిని క‌ప్పిపుచ్చ‌లేక పోయారు. ఇక‌, ఇలానేన‌టించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇక‌, జ‌య‌సుధతో అన్న‌గారి కాంబిషేన్ పెద్ద‌గా పండేది కాదు.

అయిన‌ప్ప‌టికీ.. చాలా సినిమాల్లో క‌లిసి న‌టించారు. ఇలా న‌టించిన సినిమాలో యుగంధ‌ర్ సూప‌ర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ పోషించారు. ఇక‌, హీరోయిన్‌గా జ‌య‌సుధ న‌టించింది. పెద్ద‌గా డ్యూయ‌ట్లు లేక‌పోయినా.. రొమాన్స్ సీన్లు లేక‌పోయినా.. హాట్ ఎక్కించే ఒక‌టి రెండు సీన్లు మాత్రం ఉన్నాయి. అయితే.. వీటిని పండించేందుకు ద‌ర్శ‌కుడు ఎంతో ప్ర‌య‌త్నించాడ‌నే చెప్పాలి.

ఎందుకంటే.. అన్న‌గారి వ‌య‌సు అప్ప‌టికే 50. కానీ, జ‌య‌సుధ వ‌య‌సు అప్ప‌టికి కేవ‌లం 18-20లోపు మా త్ర‌మే ఉంటుంది. దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ సీన్లు పండించేందుకు.. ద‌ర్శ‌కుడు చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ ముందు జ‌య‌సుధ పీల‌గా.. స‌న్న‌గా క‌నిపించ‌డంతో.. క‌వ‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన సీన్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. అయినా.. ఎక్క‌డా ఎబ్బెట్టుగా మాత్రం అనిపించ‌వు.

సినిమా మొత్తంలో ఎక్క‌డా ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద‌గా డ్యూయెట్లు లేకుండానే సినిమా పూర్త‌వుతుంది. ఎన్టీఆర్ సోలో సాంగ్స్ ఎక్కువ‌గా చేసిన సినిమా కూడా ఇదేన‌ని టాక్‌. కాంబినేష‌న్ బాగున్నా.. సింగిల్ ఫ్రేమ్‌లోకి వ‌చ్చేస‌రికి మాత్రం కొంత ఇబ్బంది అనిపించిన సీన్ల‌ను స‌త్య‌నారాయ‌ణ‌తో క‌వ‌ర్ చేసేశారు. ఇదీ.. సంగ‌తి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news