Moviesఆ హీరోయిన్ ని దూరం పెట్టిన విజయ్..సమంత ఫుల్ హ్యాపీ..ఎందుకంటే..?

ఆ హీరోయిన్ ని దూరం పెట్టిన విజయ్..సమంత ఫుల్ హ్యాపీ..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు . దానికి మరో నిదర్శనమే విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన లైగర్ సినిమా ఏ రేంజ్ లో బోల్తా కొట్టిందో తెలిసిందే. అంతకుముందు తీసిన అర్జున్ రెడ్డి పెళ్లిచూపులు సినిమాల పరువు కూడా ఈ సినిమా తీసేసింది. ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి.. రౌడీ హీరో అనే వాళ్ళు . ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే నత్తోడు ..లైగర్ సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి విజయ్ దేవరకొండ నటన కాదు కారణం ..డైరెక్షన్ అని అందరికీ తెలిసిన విషయమే . కాగా సినిమా భారీ హీట్ అవుతుందని నమ్మకంతో విజయ్ దేవరకొండ పూరితో ఆల్రెడీ మరో సినిమాకి కమిట్ అయ్యాడు. జనగణమన డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఎన్నోసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా లైగర్ ఫ్లాప్ అవడంతో ఈ సినిమా అటకెక్కింది. అంతేకాదు విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తుంది .

ఈ క్రమంలోనే సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకోవడంతో పూజా హెగ్డే కెరియర్ అటూ ఇటూ కాకుండా సింగిల్గా మిగిలిపోయింది . అంతేకాదు పూజ హెగ్డేను అడిగి మరి ఈ సినిమాలో పెట్టించుకున్న విజయ్ దేవరకొండ ఆమెను దూరం పెడుతున్నట్లు కూడా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే టైంలో సమంత తో ఎలాగైనా నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలని ఆమెతో మింగిల్ అవుతున్నాడు విజయ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ – సమంత హీరోయిన్గా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని మూడో షెడ్యూల్ కి రెడీగా ఉంది . కాగా త్వరలోనే ఈ సినిమా మూడో షెడ్యూల్ షురూ కానున్నట్లు తెలుస్తోంది. సమంత హెల్త్ బాగో లేకపోయినా సరే విజయ్ కోసం హెల్త్ ని చక్కబెట్టుకొని ఈ షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధపడిందట. ఒకవేళ నిజంగా ఈ సినిమా హిట్ అయితే మాత్రం విజయ్ – సమంత కెరీర్ తిరిగిపోయిన్నట్లే..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news