Moviesవెడ్డింగ్ యానివర్సరీ రోజు అభిమానులకి సర్ ప్రైజ్.. విక్కి-కత్రీనా గుడ్...

వెడ్డింగ్ యానివర్సరీ రోజు అభిమానులకి సర్ ప్రైజ్.. విక్కి-కత్రీనా గుడ్ న్యూస్..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ..గత ఏడాది డిసెంబర్ 9న ప్రేమించిన హీరో వికీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న కత్రినా కైఫ్ ..తనదైన స్టైల్ లో రెండు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీని ఏలేస్తుంది. ఇప్పటికి హీరోయిన్గా చేస్తూ జనాలను మెప్పిస్తుంది అంటే దానికి మెయిన్ రీజన్ కత్రినా అందాలు .

నటనపరంగా మంచి టాలెంట్ ఉన్నా కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎలాంటి అందాన్ని మెయింటైన్ చేసిందో.. నిన్న కాక మొన్న వచ్చిన ఫోన్ బూత్ అనే సినిమాలో కూడా అలాంటి అందాలని చూపించి కుర్రాలను మెల్ట్ చేసింది. కాగా స్టార్ హీరో విక్కి తో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ బ్యూటీ గత ఏడాది డిసెంబర్ 9న కుటుంబ సభ్యుల సమక్షంలో రాజస్థాన్లో గ్రాండ్గా పెళ్లి చేసుకుంది .

వాళ్ళ పెళ్లి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. పెళ్లి టైంలో కత్రినా పెట్టిన కండిషన్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్గా ఈ జంట తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. ఎటువంటి హంగామా లేకుండా చాలా సింపుల్గా కూల్ గా భార్యాభర్తలు ఇద్దరు తమకు తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పుకున్నారు. కాగా గత కొంతకాలంగా విక్కి- కత్రినా విడాకులు తీసుకోబోతున్నారు అని వస్తున్న రూమ్స్ కు పరోక్షకంగా చెక్ పెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్లైంది ఈ జంట . అంతేకాదు వీళ్ల మధ్య ఉన్న దాంపత్య బంధం చూస్తుంటే జనాలకు చాలా ముచ్చటగా ఉంది.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే వీళ్ళు విడాకులు తీసుకోవట్లేదని అభిమానులు ఊపిరి పీల్చుకుని ..ఆ గుడ్ న్యూస్ త్వరగా చెప్తే బాగుంటుంది అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news