Moviesబాల‌య్యా గోల‌య్యా... ఇదేం అల్ల‌ర‌య్యా... సుగుణ సుంద‌రి మేకింగ్ వీడియో ర‌చ్చ‌..!

బాల‌య్యా గోల‌య్యా… ఇదేం అల్ల‌ర‌య్యా… సుగుణ సుంద‌రి మేకింగ్ వీడియో ర‌చ్చ‌..!

న‌ట‌సింహం బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా మ‌లినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వీరసింహారెడ్డి. నందమూరి అభిమానులు ఈగరగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వ‌దులుతున్నారు. సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్‌లు సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉండేలా ఉంటున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన జై బాలయ్య.. జై జై బాలయ్య సాంగ్ తో పాటు సుగుణసుందరి సాంగ్ అయితే పిచ్చెక్కించేస్తున్నాయి. ఈ రెండు సాంగ్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊప‌డంతో పాటు వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అన్న చర్చకు కారణమయ్యాయి.

ఇక మూడో ఐటెం సాంగ్ కూడా ఈనెల 24న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన సుగుణసుందరి సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. భారీ వ్యూ సాధిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ సాంగ్‌ను యూరప్ లోని టర్కీలో అందమైన లొకేషన్లో షూట్ చేశారు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ బాలయ్య – శ్రుతి అదరగొట్టేశారు.

బాలయ్య – శృతి ఇద్దరూ కలిసి వేసిన స్టెప్పులు ఎంత స్టైలిష్ గా ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తూ సుగుణసుందరి సాంగ్ మేకింగ్ విజువల్స్ ట్విట్టర్లో షేర్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ టీం. టర్కీలో షూట్ చేసిన లొకేషన్లతో పాటు.. బాలయ్య – శృతి వేసిన స్టెప్పలు ఈ సాంగ్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రామ్‌ మిరియాల శర్మ పాడారు.

థ‌మ‌న్‌ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది అని చెప్పాలి. అఖండ సినిమాకు తమను ఏ స్థాయిలో మ్యూజిక్ ఇచ్చాడో ? ఇప్పుడు సుగుణసుందరి స్థాయికి కూడా అదే రేంజ్ లో ఇచ్చాడని చెప్పాలి. అయితే ఈ సాంగ్ మేకింగ్ వీడియోలో బాల‌య్య చిలిపిగా అల్ల‌రి చేశాడు. ఓ వైపు శేఖ‌ర్ మాస్ట‌ర్ మూమెంట్స్ చెపుతుంటే బాల‌య్య, శృతితో క‌లిసి ఎంజాయ్ చేస్తూ వేసిన స్టెప్పులు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news