Moviesపూజా హెగ్డేను బాగా వాడేస్తోన్న ఇద్ద‌రు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌... ఇదేం...

పూజా హెగ్డేను బాగా వాడేస్తోన్న ఇద్ద‌రు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌… ఇదేం పిచ్చో మ‌రి…!

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు అనేవి కామన్. అప్పట్లో కొందరు హీరోలు వరుసగా ఒకే హీరోయిన్ ను తమ సినిమాల్లో రిపీట్ చేస్తూ వచ్చేవారు. అలాగే కొందరు నిర్మాతలు కూడా ఒకే హీరోయిన్‌ను తమ సినిమాల్లో రిపీట్ చేసేవారు. కొందరు హీరోలు – దర్శకుల కాంబినేషన్లకు అప్పట్లో క్రేజ్ ఉండడంతో ఆ హీరోలు ఆ దర్శ‌కులు కాంబినేషన్లు ఎక్కువగా రిపీట్ అయ్యేవి. అయితే ఆ సెంటిమెంట్లను ఇప్పుడు కూడా కొందరు కంటిన్యూ చేస్తున్నారు.

ఒక హీరో – హీరోయిన్ కాంబినేషన్లో ఒకటి రెండు హిట్ సినిమాలు వస్తే వారిద్దరూ కలిసి నటిస్తే చూడాలన్న ఆత్రుత ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక హీరో – దర్శకుడు కాంబినేషన్ విజయవంతం అయితే వాళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజహెగ్డే మూడేళ్లుగా పట్టిందల్లా బంగారం అయింది. వరుసగా హిట్లు రావడంతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది.

అయితే రీసెంట్ గా ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. దీనికి తోడు రష్మిక, శ్రీలీల‌ లాంటి కుర్ర హీరోయిన్ల నుంచి పూజ గట్టి పోటీ ఎదుర్కొంటుంది. అయినా కూడా పూజ హెగ్డేను ఇద్దరూ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు వదలకుండా వాడేస్తున్నారు. ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు పూజపై అంత ప్రేమ ఏంటి ? అన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ – పూజకు వరుసగా తన మూడో సినిమాలోనూ అవకాశం ఇచ్చేశాడు.

అరవింద సమేత వీర రాఘవ – అలవైకుంఠపురంలో సినిమాల్లో ఛాన్సులు ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబుతో తాను తెరకెక్కిస్తున్న సినిమాలోని ఆమెని హీరోయిన్గా తీసుకున్నాడు. గతంలో మహేష్ తో ఆమె మహర్షి సినిమాలో జోడి కట్టింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా త్రివిక్రమ్ రిపీట్ చేస్తున్నాడు. ఇక త్రివిక్ర‌మ్ మాత్ర‌మే కాకుండా హ‌రీష్ శంక‌ర్‌కు కూడా పూజా మాయ‌లో ప‌డిపోయాడు.

పూజ అంటే హ‌రీష్‌కు పిచ్చి అంట‌. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఆ త‌ర్వాత గద్దలకొండ గణేశ్ సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌. ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలోనూ పూజ‌నే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని హ‌రీష్ ఫిక్స్ అయిపోయాడ‌ట‌. త్రివిక్ర‌మ్‌, హ‌రీష్‌కు ఇదేం పిచ్చోగాని పూజ మాయ‌లో ప‌డిపోయి ఆమెను త‌ప్ప మ‌రో హీరోయిన్ వైపే చూడ‌డం లేద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news