Moviesటాలీవుడ్ హీరోయిన్లు మాల్దీవులకెళ్ళి ఎవరితో ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్లు మాల్దీవులకెళ్ళి ఎవరితో ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా..?

హీరోయిన్స్ నిర్మాత డబ్బులతో మాల్దీవులకెళ్ళి ఎవరితో ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా..? కరోనాకి ముందు నుంచి మన సౌత్ హీరోయిన్స్ చాలా మంది మాల్దీవులకి వెళ్ళి సేద తీరుతున్న సంగతి తెలిసిందే. మన సౌత్ హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ బ్యూటీస్ అయితే మరీ దారుణం. ఖాళీగా ఉంటే మాల్దీవుల్లో తేలుతున్నారు. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే హీరోయిన్స్‌లో తొంబై శాతం తమ సొంత డబ్బుతో మాల్దీవులకి వెళ్ళడం లేదని.

హీరోయిన్‌గా సక్సెస్ అయ్యాక సొంత డబ్బులన్నీ బ్యాంక్‌లో మూలుగుతుంటాయి. ర‌క‌ర‌కాల వ్యాపారాల‌తో పాటు రియ‌ల్ ఎస్టేటుల్లో వారు భారీగా పెట్టుబ‌డులు పెడుతూ ఉంటారు. అయితే వీరి ఎంజాయ్‌మెంట్‌కు మాత్రం నిర్మాత డబ్బులో లేక బాయ్‌ఫ్రెండ్ డబ్బులో మంచి నీళ్ళలా ఖర్చవుతుంటాయి. ఇది దాదాపు అందరి హీరోయిన్స్ విషయంలోనూ జరుగుతున్నదే. సినిమాకి సైన్ చేసిన తర్వాత నిర్మాతలకి ఒక్క హీరోయిన్ వల్ల ఎంత ఖర్చవుతుందో బయటకి లెక్కలు చూపిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి.

సౌత్‌లో రష్మిక మందన్న, పూజా హెగ్డే, కీర్తి సురేష్ లాంటి వారు..బాలీవుడ్‌లో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ దగ్గర్నుంచీ సోనం కపూర్, భూమీ పడ్నేకర్, దియా మీర్జా, మానుషీ చిల్లర్, మలైకా అరోరా, శ్రద్దా కపూర్, మాధురీ దీక్షిత్, కాజోల్ లాంటి భామలందరూ మాల్దీవులలో వెళ్ళి సింగిల్ గానో లేదా త‌మ ఫ్యామిలీల‌తోనో ఎంజాయ్ చేసి వస్తున్నారు. వీరిలో ఒక్క కీర్తి సురేష్ మాత్రమే పద్దతిగా కనిపించింది. అది కూడా తన కుక్కపిల్లతో..!

మిగతా వారందరూ బికినీ ధరించీ అందాలను ఆరబోస్తూ నాటుగా ఘాటుగా ఫొటోలను వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూజా హెగ్డే, రష్మిక ల బికినీ పిక్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే, మాల్దీవుల టూరిజం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిసేందుకు భారీ డిస్కౌంట్‌తో అన్నీ వస్తులను కల్పిస్తున్నారు. అయితే, ఆ బడ్జెట్ కూడా హీరోయిన్స్‌కి నిర్మాతలో, రాజకీయ నాయకులో మోస్తున్నట్టు చెప్పుకుంటుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news