Moviesటాలీవుడ్‌లో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే...!

టాలీవుడ్‌లో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే…!

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఎంత గొప్ప సినిమా అయినా థియేట‌ర్ల‌లో రెండు వారాలు ఆడ‌డ‌మే గ‌గ‌నం. ఇప్పుడు అంతా మూడు, నాలుగు వారాలు ఆడితే గొప్ప అన్న‌ట్టుగా ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇప్పుడు ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసి.. త‌క్కువ రోజుల్లో ఎక్కువ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టుకోవాలి. అయితే టాలీవుడ్‌లో గ‌త కొన్నేళ్ల‌లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు ఏవో చూద్దాం.

1- లెజెండ్ :
బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా లెజెండ్. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా 2017 వ‌ర‌కు థియేట‌ర్ల‌లో ఆడింది. ప్రొద్దుటూరు అర్వేటిలో 55 రోజులు ఆడాక షిఫ్ట్ అయిన ఈ సినిమా అర్చ‌న థియేట‌ర్లో 1000 రోజులు దాటేసి ఏకంగా 1116 రోజులు ఆడింది.
2- మ‌గధీర :
రామ్‌చ‌ర‌ణ్ కెరీర్లో రెండో సినిమాగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌గ‌ధీర షిఫ్టుల వారీగా క‌ర్నూలులో 1000 రోజులు ఆడింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే ( 2009లో) రు. 75 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది.
3- పోకిరి :
పూరి జ‌గ‌న్నాథ్ – మ‌హేష్ కాంబినేష‌న్లో 2006లో వ‌చ్చిన పోకిరి ఇండ‌స్ట్రీ హిట్‌. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో 580 రోజులు ఆడింది.

4- సమరసింహా రెడ్డి :
స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా బాల‌య్య – బి. గోపాల్ కాంబోలో వ‌చ్చిన మూడో సినిమా. ఈ సినిమా ఆ రోజుల్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడ‌డంతో పాటు ప‌లు కేంద్రాల్లో 365 రోజులు ఆడింది.
5- మంగమ్మ గారి మనవడు:
బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా మంగమ్మగారి మనవడు. బాల‌య్య‌కు సోలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్ ఈ సినిమాతోనే ద‌క్కింది. 1984లో విడుదలైన ఈ సినిమా ఏకంగా 567 రోజులు థియేటర్లో ఆడింది.
6- ఖైదీ :
చిరంజీవిని స్టార్ హీరోగా చేసిన సినిమా ఖైదీ. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా 365 రోజులు ఆడింది. ఈ సినిమాతో చిరు టాలీవుడ్‌లో తిరుగులేని మెగాస్టార్ అయిపోయాడు.

7- మరో చరిత్ర :
కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు బాలచందర్ తెరకెక్కించిన అద్భుతమైన మరపురాని చిత్రం మరో చరిత్ర. 1978లో విడుదలైన ఈ సినిమా 556 రోజుల పాటు థియేటర్ల‌లో కంటిన్యూగా ఆడింది.
8- ప్రేమాభిషేకం :
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన మ‌ధుర ప్రేమ‌క‌థా సినిమా ప్రేమాభిషేకం. నెగ‌టివ్ ఎండింగ్‌తో వ‌చ్చిన ఈ సినిమా 1981లో రిలీజ్ అయ్యి 533 రోజుల పాటు ఆడింది. శ్రీదేవి, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించారు.
9- లవకుశ :
ఎన్టీఆర్ హీరోగా 1963లో విడుదలైన సినిమా లవకుశ. తెలుగులో తొలి కలర్ సినిమా ఇది. ల‌వ‌కుశ అప్ప‌ట్లోనే ఉన్న పైస‌ల రేట్ల‌తో ఏకంగా 469 రోజుల పాటు థియేటర్లో ఆడింది. ఆ రోజుల్లోనే కేవ‌లం పైస‌ల్లో ఉన్న టిక్కెట్ రేట్ల‌తో కోటి రూపాయ‌ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది.

10- ప్రేమ సాగరం :
డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో సంచలన విజయం సాధించాయి. ఇప్ప‌టి కోలీవుడ్ క్రేజీ హీరో శింబు తండ్రి టి. రాజేంద‌ర్ న‌టించ‌డంతో పాటు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన సినిమా ప్రేమ‌సాగ‌రం. ఈ సినిమా 1983లో రిలీజ్ అయ్యి తెలుగులోనే ఏకంగ 465 రోజులు ఆడింది.
11- అడ‌విరాముడు :
కె. రాఘవేంద్రరావు – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అడవి రాముడు. 1977లో వచ్చిన అడ‌వి రాముడు థియేట‌ర్ల‌లో 365 రోజులు ఆడ‌డంతో పాటు ఏకంగా రు. 3 కోట్ల షేర్ రాబట్టింది. జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ఎన్టీఆర్ క‌మ‌ర్షియ‌ల్ స్టామినా ఫ్రూవ్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news