Moviesఏంటి ఎప్పుడూ లేనిది కొత్త‌గా ఉందే... బాల‌య్య కోసం తార‌క్ ఫ్యాన్స్‌...!

ఏంటి ఎప్పుడూ లేనిది కొత్త‌గా ఉందే… బాల‌య్య కోసం తార‌క్ ఫ్యాన్స్‌…!

నంద‌మూరి హీరోల్లో బాల‌య్య‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య కాస్త గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో ఉంది. గ‌త ప‌దేళ్ల‌లో ఎన్నోసార్లు వీరి మ‌ధ్య అంత స‌ఖ్య‌త లేద‌న్న ప్ర‌చారం జ‌ర‌గ‌డం.. ఆ త‌ర్వాత వీరు ఏదో ఒక సంద‌ర్భంలో క‌లుసుకోవ‌డం… మ‌ళ్లీ గ్యాప్ అన‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం కామ‌న్‌గా జ‌రుగుతూ వ‌స్తోంది.

తాజాగా మ‌రోసారి బాల‌య్య‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య స‌ఖ్య‌త కుదిరింద‌న్న ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రుగుతోంది. వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్లో బాల‌య్య వీర‌సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీర‌య్య సినిమాలు రెండూ ఒక్క రోజు తేడాలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డుతున్నాయి. చిరు, బాల‌య్య మ‌ధ్య ఎలాంటి వేడెక్కే వాతావ‌ర‌ణం ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు.

చిరంజీవి సినిమాకు చిరు, చెర్రీ అభిమానుల‌తో పాటుమాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ అభిమానుల స‌పోర్ట్ కూడా మామూలుగా లేదు. అందుకే సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వీర‌సింహారెడ్డి సాంగ్స్‌, వీడియోల‌కు వ‌స్తోన్న వ్యూస్ కంటే వీర‌య్య సాంగ్స్‌, వీడియోల‌కు వ‌స్తోన్న వ్యూస్ చాలా ఎక్కువుగా ఉంటున్నాయి. వీర‌య్య‌కు మెగా, చెర్రీ అభిమానుల‌తో పాటు ర‌వితేజ ఫ్యాన్స్ స‌పోర్ట్ ఎంతైనా ప్ల‌స్ అవుతోంది.

ఇక ఇప్పుడు బాల‌య్య వీర‌సింహాకు స‌పోర్ట్ చేసేందుకు సైలెంట్‌గా ఉన్న తారక్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టి వ‌ర‌కు తార‌క్ ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉంటూ వ‌చ్చారు. అయితే పండ‌గ సినిమాల్లో వారు వీర‌సింహారెడ్డికి కంప్లీట్‌గా స‌పోర్ట్ చేస్తామంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు తార‌క్ గ్రూప్స్ అన్నింట్లోనూ వీర‌సింహారెడ్డికి పాజిటివ్‌గా ట్రెండ్ అయితే స్టార్ట్ అయ్యింది.

ఈ ట్రెండ్‌తో ఇప్పుడు నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవ‌ధులు అయితే లేవు. ఇది ఖ‌చ్చితంగా వీర‌సింహారెడ్డికి ప్ల‌స్ అవుతుంద‌నే చెప్పాలి. ఇక వీర‌సింహారెడ్డి సినిమా జ‌న‌వ‌రి 12న విజ‌య్ వార‌సుడికి పోటీగా అదే రోజు రిలీజ్ అవుతోంది..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news