Moviesశ్రిహాన్‌తో బ్రేకప్... సూసైడ్ అటెంప్ట్ కూడా.. ఫైనల్లీ నిజం చెప్పేసిన సిరి..!

శ్రిహాన్‌తో బ్రేకప్… సూసైడ్ అటెంప్ట్ కూడా.. ఫైనల్లీ నిజం చెప్పేసిన సిరి..!

మనదేశంలో ఏ భాషలో బిగ్ బాస్ ప్రసారం అయినా కూడా హౌస్ లోకి వెళ్లిన వారిలో కొన్ని ప్రేమలు, కొన్ని బ్రేకప్‌లు.. కొన్ని పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. హౌస్ లో ఉన్నప్పుడు ప్రేమలో పడుతున్న కొన్ని జంటలు బయటకు వచ్చాక బ్రేకప్ చెప్పేసుకుంటున్నాయి. తెలుగు బిగ్ బాస్‌ రియాల్టీ షో సీజన్ 5లో పాల్గొన్న బ్యుటీ సిరి తొలిసారిగా తన ప్రియుడు శ్రీహ‌న్‌తో ఉన్న సంబంధాలపై నోరు విప్పారు. రీసెంట్‌గా శ్రీహాన్- సిరి కోసం సిరి ఇంటికి కూడా వెళ్లి వచ్చాడు.

ఈ క్రమంలోనే మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ హాట్ యాంకర్ అరియానాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరి తన పర్సనల్ లైఫ్ లో చోటు చేసుకున్న వివాదాల గురించి ఎన్నో విషయాలు చెప్పుకు వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అరియానా సిరి గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన చాలా పోస్టులను చూపించారు. ఈ సందర్భంగా సిరికి, శ్రీహాన్ బ్రేకప్ చెప్పేసాడని… తన లైఫ్ నుంచి సిరి జ్ఞాపకాలను తీసేశాడని వచ్చిన కామెంట్లపై స్పందించాలని అరియానా కోరింది. దీనిపై స్పందించిన సిరి అబ్బే ఇది ఎప్పుడో జరిగింది. నేను బిగ్‌బాస్ సీజన్ 5 లో హౌస్ లో ఉన్నప్పుడు జరిగి ఉంటుందని చెప్పింది.

జ్ఞాపకాలను తీసేసి ఉంటే… తాము ఇప్పుడు కూడా ఇలా కలిసి ఉండే వాళ్ళమా అని సిరి.. అరియానాను ప్రశ్నించింది. బిగ్ బాస్ 5వ‌ సీజన్ కంప్లీట్ అయ్యాక తమ ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో చాలా సమస్యలు వచ్చాయని వాటి గురించి చెబితే ఇలా జరిగిందా ? అని మీరు కూడా షాక్ అవుతారంటూ సిరి చెప్పింది.
అలా జరిగిన సంఘటనల్లో ఒకటి రెండు చెప్పాలని అరియానా సిరిని కవ్వించింది. అయితే శ్రీహాన్‌తో తాను బ్రేకప్ వరకు వెళ్లిన విషయాన్ని సిరి అంగీకరించింది.

శ్రీహాన్ ఒక్కడే టూర్‌కు వెళ్లాడని.. ఆ సమయంలో తనకు కోవిడ్ రావడంతో తాను కూడా ఏదో ఒకటి చేసేసుకుందామన్న ఆలోచనలోకి వచ్చేసానని సిరి వాపోయింది. అసలు ఈ ప్రపంచానికి ఇంట్లో వాళ్లకు కనపడకుండా ఎక్కడికైనా వెళ్లిపోదామన్నా ఆలోచన కూడా తనకు వచ్చిందని సిరి చెప్పింది. తనకు కోవిడ్ సోకినప్పుడు ఉదయం 6 గంటలకే లేచి మణికొండ రోడ్లపై చెప్పులు లేకుండా కూడా తిరిగానని ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డానని సిరి వాపోయింది.

అయితే మళ్లీ శ్రీహాన్ వచ్చి తనను ఇంటికి తీసుకువెళ్ళాడని అలా తమ ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడిందని… ఇక ఎప్పటికీ తాము ఎప్ప‌ట‌కీ విడిపోమన్నంత బలమైన బంధం తమ ఇద్దరి మధ్య నెలకొందని సిరి తెలిపింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో సిరి – యూట్యూబ‌ర్‌ షణ్ముఖ్‌ మధ్య చాలా క్లోజ్ రిలేషన్ ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం చివరకు షణ్ముఖ్‌ కు ప్రియురాలైన దీప్తి సునైనాను దూరం చేసేంతగా బలపడింది. విచిత్రం ఏంటంటే వాటిని దృష్టిలో పెట్టుకుని సిరి తాజాగా శ్రీహన్‌తో తాను విడిపోతానన్న పుకార్లు వచ్చాయని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news