Moviesఅసలు నిజం కక్కించిన బాలయ్య..ఆ హీరోతో రాశిఖన్నా అది నిజమే..!!

అసలు నిజం కక్కించిన బాలయ్య..ఆ హీరోతో రాశిఖన్నా అది నిజమే..!!

నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే . ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఈ హీరో ఎదుటివారిని ప్రశ్నలు వేసి ముప్పితిప్పలు పెట్టి అసలు నిజం కక్కించడం బాలయ్య స్పెషాలిటీ . ఈ విషయం అన్ స్టాపబుల్ షో స్టార్ట్ అయిన తర్వాతే తెలిసింది . అప్పటివరకు నటుడిగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్ గా , తండ్రిగా ఫ్యాన్స్ కు దేవుడిగా ఉన్న బాలయ్య సరికొత్త అవతారం ఎత్తుతూ హోస్టుగా కూడా విజృంభించేశాడు . ఎవరు ఊహించిన విధంగా ఆహా ఓటీటీలో షో కి హోస్టుగా సైన్ చేసి ఓటిటిలను షేక్ చేశాడు .

కాగా సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సీజన్ 2 కూడా అదే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే సీజన్ 2 కి బడా బడా సెలబ్రెటీస్ ని పిలిపిస్తూ మరింత రసవత్తరంగా ముందుకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే షోకి రీసెంట్గా జయప్రద , జయసుధ ,అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గెస్ట్లుగా వచ్చారు . కాగా రాశికన్నా గురించి గత కొన్ని నెలలుగా వైరల్ అవుతున్న న్యూస్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు బాలయ్య .

“నీ ఫస్ట్ క్రష్ ఇండస్ట్రీలో ఎవరు” అంటూ అడగ్గానే రాశి ఖన్నా ఫేస్ ఒక విధంగా మారిపోయింది. అబద్ధం చెప్తే బాలయ్య పట్టేస్తాడు అని నిజం చెప్పుతూ విజయ్ దేవరకొండ అంటూ చెప్పుకొచ్చింది .ఈ క్రమంలోనే అక్కడ ఒకసారి గా అరుపులు కేకలతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. మనకు తెలిసిందే వీళ్ళిద్దరూ కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో జత కట్టారు . ఆ సినిమాలో వీళ్లు చేసిన హాట్ రొమాన్స్ తో వీళ్ల మధ్య కిచ్ కిచ్ సంబంధం కూడా ఏర్పడింది అంటూ వార్తలు వినిపించాయి. ఇలా విజయ్ దేవరకొండ నా క్రష్ అని చెప్పడంతో ఆ వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏమైనా సరే బాలయ్య అసలు నిజాలు కక్కించడంలో నెంబర్ వన్ అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news