Moviesదండం పెడతాం సార్..ఆ పని చేయద్దు..ప్రశాంత్ నీల్ కి తారక్ ఫ్యాన్స్...

దండం పెడతాం సార్..ఆ పని చేయద్దు..ప్రశాంత్ నీల్ కి తారక్ ఫ్యాన్స్ రిక్వెస్ట్..!!

రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న తర్వాత తారక్ నెక్స్ట్ సినిమాపై అస్సలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . రీజన్ ఏంటో తెలియదు కానీ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టట్లేదు అన్న మాటలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఎప్పుడో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయినా కానీ ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా పూజ కార్యక్రమాలను మొదలు పెట్టకపోవడం ఇండస్ట్రీలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారే కానీ ఇప్పటివరకు వాటికి సంబంధించిన సెకండ్ స్టెప్ వేయడం లేదు. మరీ ముఖ్యంగా కొరటాల శివతో తెరకెక్కబోయే నెక్స్ట్ సినిమాపై అసలు పట్టించుకోవట్లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ చెప్పిన విధంగా స్క్రిప్ట్ మారుస్తున్నాడని గత ఆరు నెలల నుంచి కొరటాల అదే పనిలో ఉన్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కాగా ఇదే క్రమంలో కొరటాల సినిమాను పక్కన పెట్టి ..ఎన్ టీఆర్ 31 సినిమాను మొదలు పెడితే బాగుంటుంది అని కూడా ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు.

ఇదే క్రమంలో కొందరు నందమూరి ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు . కొరటాల శివ లాగ నువ్వు సినిమా ల్యాగ్ చేయొద్దని . కంటెంట్ మంచిగా ఇస్తే సినిమాని హిట్ చేసే బాధ్యత మాది అని ..దయచేసి కొరటాల శివ లాగా సినిమా అప్డేట్స్ ఇవ్వకుండా ఫాన్స్ ఇబ్బంది పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా హీరోయిన్ల విషయంలో స్పెషల్ కేర్ తీసుకొని త్వరగా అప్డేట్స్ ఇస్తే ఎన్టీఆర్ 31 బ్లాక్ బస్టర్ హిట్గా బాక్స్ ఆఫీస్ వద్ద నిల్చో పెడతామని హామీ ఇస్తున్నారు. చూడాలి మరి ప్రశాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో,, ఏది ఏమైనా సరే కొరటాల తొందరపడకపోతే కష్టాలు పాలు అవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news