Moviesమెగామాస్ సాంగ్ పూన‌కాలు లోడింగ్ కాదు.. కాపీ లోడింగ్‌.. ప‌క్కా ఎవిడెన్సులు...

మెగామాస్ సాంగ్ పూన‌కాలు లోడింగ్ కాదు.. కాపీ లోడింగ్‌.. ప‌క్కా ఎవిడెన్సులు ఇవిగో..!

దిస్ ఈజ్ నాట్ మాస్ సాంగ్‌.. దిస్ ఈజ్ మెగా మాస్ సాంగ్ అంటూ దేవి మ‌రోసారి చ‌క్క‌గా రాడ్ దింపేశాడు. దేవీ గొప్ప మ్యూజిక్ డైరెక్ట‌రే.. అదంతా ఒక‌ప్పుడు.. కానీ ఇప్పుడు స‌రిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎందుకో గాని వాల్తేరు వీర‌య్య సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ అయిన ఏ సాంగ్ కూడా స‌రిగా ఆక‌ట్టుకోలేద‌న్న‌ది వాస్త‌వం. ఇంకా చెప్పాలంటే బాల‌య్య వీర‌సింహారెడ్డికి, వీర‌య్య‌కు ప్ర‌తి విష‌యంలోనూ కంపేరిజ‌న్లు న‌డుస్తున్నాయి.

ఈ రెండు సినిమాలు సంక్రాంతికే వ‌స్తున్నాయి. అటు వీర‌సింహారెడ్డి నుంచి వ‌చ్చిన అన్ని సాంగ్స్ అదిరిపోతున్నాయి. ఇటు వీర‌య్య సాంగ్స్ మ‌రీ రొట్టి, పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డే అన్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నాలుగో సాంగ్‌లో అయినా దేవీ కొత్త‌గా ఊపుతాడు అనుకుంటే.. సేమ్ టు సేమ్ పాత ట్యూన్లు మిక్సీలో వేసి పిండేశాడు. సాంగ్ లిరిక్స్‌, కాస్ట్యూమ్స్‌, పాట పాడిన విధానం ఏమంత ఆస‌క్తిగా లేదు.

పోని సాంగ్ విన‌గా విన‌గా అయినా ఎక్కుతుంద‌న్న ఆశ‌లు కూడా క‌న‌ప‌డ‌డం లేదు. 3.21 నిమిషాలు ఉన్న సాంగ్‌లో 1.26 నిమిషాల‌కు వ‌చ్చిన బ్యాకెండ్ విజిల్ ట్యూన్ నూటికి నూరుశాతం పాత‌దే. అక్క‌డ వాడిన ట్యూన్ అంతా పాత సినిమాల్లో కొన్ని ట్యూన్ల‌ను మిక్సీలో వేసి తీసిన‌వే. అస‌లు సాంగ్ మొత్తం మీద ఈ ట్యూన్ కొత్త‌గా వాడాడు అని చెప్పుకునేందుకు ఒక బిట్ కూడా లేదు. ఏ లిరిగిరి బ‌టాపేట్ అంటూ వ‌చ్చిన లిరిక్ వినిపించిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బంగారం సినిమాలోని జ‌రుగు జ‌రుగు మ‌న‌వాడు వ‌చ్చాడు అన్న సాంగ్ ట్యూన్ ఎత్తిప‌డేశాడు.

డోన్ట్ స్టాప్ డ్యాన్సింగ్‌, పూన‌కాలు లోడింగ్ అని చిరు, ర‌వితేజ‌తో గొంతులు క‌లిపినా కూడా సాంగ్‌కు హైప్ వ‌చ్చే ప‌రిస్థితి లేదంటే దేవీని క్ష‌మించ‌లేం. అయితే చిరు, ర‌వితేజ క‌లిసి వేసిన స్టెప్పులు మాత్రం బాగున్నాయి. అయితే చిరు, ర‌వితేజ వాడిన కాస్ట్యూమ్స్‌తో పాటు కొన్ని స్టెప్పులు కూడా శంక‌ర్‌దాదా జిందాబాద్ సినిమాలో చిరు, శ్రీకాంత్ కాస్ట్యూమ్స్‌కు జిరాక్స్‌గా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news