Movies"ధమాకా" జనాల రివ్యూ: ఒక్కొక్కడికి జానడు ఎత్తున పగిలిపోవాల్సిందే..!!

“ధమాకా” జనాల రివ్యూ: ఒక్కొక్కడికి జానడు ఎత్తున పగిలిపోవాల్సిందే..!!

టాలీవుడ్ మాస్ మహారాజా .. రవితేజ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా ధమాకా. మల్టీ టాలెంటెడ్ త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ధమాకా సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్గా నటించింది. మాస్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. మాస్ మహారాజ్ అభిమానులకు పూనకాలు తెప్పించేసింది. ఫస్ట్ షో నే ధమాకా అనిపించాడు రవితేజ .

మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా హిట్ లేకుండా బాధపడుతున్న రవితేజకు ..ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చాలామంది తెరపై శ్రీ లీల – రవితేజ రొమాన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వదని భావించారు. అయితే తెరపై సినిమా థియేటర్లో వాళ్ళ రొమాన్స్ చూసిన జనాలు రేంజ్ లో మెల్ట్ అయిపోయారు. కాగా మధ్య మధ్యలో పడిన పవర్ పంచ్ డైలాగ్స్ సినిమాకి మరింత హైలెట్ గా నిలిచాయి. మరి ముఖ్యంగా ఈ సినిమా చూసిన రవితేజ అభిమానులు ప్రతి ఒక్కరు మిరపకాయ సినిమాలో రిషి కాదు.. బలుపు సినిమాలో శంకర్ కాదు ..ఏకంగా వెంకీ సినిమాలోని వెంకటేశ్వర్లు దిగేసాడు .. అంటూ థియేటర్లలో రవితేజ ఫ్యాన్స్ అరుపులతో కేక పెట్టిస్తున్నారు.

రవి తేజ పర్ఫామెన్స్ చూస్తుంటే ఒక్కొక్కడికిజానడు ఎతూన పగిలిపోవాల్సిందే ..ఎవరైతే తనని టార్గెట్ చేసి ఫ్లాప్ హీరో అన్నారో.. అలాంటి వాళ్ళకి హిట్ హీరోగా మార్చుకున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అయితే సినిమా లో మొత్తానికి రవితేజ నటనే హైలైట్ గా మారిందని.. శ్రీ లీల స్క్రీన్ స్పేస్ పెద్దగా లేదని ..కథ కూడా ఓల్డ్ లాగే ఉందని.. మరి కొంచెం మాస్ మసాలా యాడ్ చేసి ఘటైన సీన్స్ తెరకెక్కిచుంటే సినిమా ఓ రేంజ్ లో అల్లాడించి ఉండేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు . మొత్తంగా కొన్ని పాజిటివ్ కామెంట్స్ కొన్ని నెగటివ్ కామెంట్స్ తో రవితేజ ధమాకా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. చూడాలి మరి ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో ధమాకా మూవీ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news