Moviesనా పెళ్లిలో నాకే ఘోర అవమానం.. మంజిమా మోహన్‌ సంచలన నిర్ణయం..!!

నా పెళ్లిలో నాకే ఘోర అవమానం.. మంజిమా మోహన్‌ సంచలన నిర్ణయం..!!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న మంజిమా మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫిజిక్ పరంగా ఎలా ఉన్నా కానీ నటన పరంగా సూపర్ యాక్టివ్ అంటూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . అంతేకాదు తనదైన స్టైల్ లో నటిస్తూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా మంజిమ మోహన్ అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది . కాగా రీసెంట్ గానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న మజిమా మోహన్ కొన్ని నెలల ముందు వరకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ ట్రోలింగ్ అయిందో అందరికీ తెలిసిందే .

తమ మూడేళ్ల ప్రేమ బంధాన్ని రీసెంట్ గానే నాలుగు రోజులు ముందే అఫీషియల్ చేస్తూ గౌతమ్ కార్తీక్ ను పెళ్లి చేసుకున్న మజిమా మోహన్.. పెళ్లయిన రెండు రోజులకే వివాహ బంధం పై షాకింగ్ కామెంట్స్ చేసింది . పెళ్లి తర్వాత ఫస్ట్ టైం మీడియాతో మంజిమా మోహన్ మాట్లాడుతూ..” ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది . మేము ఇద్దరం డేటింగ్ లో ఉన్నామంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.. అవి నమ్మకండి మేము ప్రేమించుకున్నాం ..డేటింగ్ లో లేము. పద్ధతిగా పెళ్లి చేసుకున్నం. అందరూ నా ఫిజిక్ పై కామెంట్ చేస్తున్నారు”.

“అఫ్ కోర్స్ నా పెళ్లిలో కూడా నేను విన్నాను ..చాలా మంది నేను లావుగా ఉన్నానని.. కార్తీక్ అందంగా ఉన్నాడని మాట్లాడుకుంటున్నారు . వినడానికి చాలా బాధగా అనిపించిన నేనేంటో నాకు తెలుసు. నేను చాలా ఫీట్ , హెల్తీగానే ఉన్నాను. శరీరాకృతి విషయంలో ఎంతో కాలం నుంచి ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. అందుకే పెళ్లి తర్వాత అలాంటి కామెంట్స్ పట్టించుకోకూడదని డిసైడ్ అయిపోయాను. ఇక ఎవరు ఏమనుకున్నా సరే నాకు అనవసరం నేను నా భర్తతో హ్యాపీగా ఉంటాను అంతే. నా వెయిట్ కి సంబంధించిన కామెంట్స్ నేను పట్టించుకోదల్చుకోవట్లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా సరే పెళ్లైన రెండో రోజే మజిమా ఇలాంటి కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news