Movies"అక్క అక్క అంటూ పెద్ద బొక్కెట్టిందే"..పవన్ కళ్యాణ్ ని గెలికిన మంచు...

“అక్క అక్క అంటూ పెద్ద బొక్కెట్టిందే”..పవన్ కళ్యాణ్ ని గెలికిన మంచు లక్ష్మి..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోలు, ఫ్యామిలీ బ్యాచ్‌ల్లో మంచు ఫ్యామిలీపై జ‌రుగుతోన్న ట్రోలింగ్‌, ప‌డుతోన్న సెటైర్లు ఎవ్వ‌రికి లేవు. అస‌లు ట్రోలింగ్ అడ్డాగా మంచు ఫ్యామిలీ మారిపోయింది. మోహ‌న్‌బాబు స‌న్నాఫ్ ఇండియా,మంచు విష్ణు సినిమాలు, డైలాగులు.. అటు మంచు ల‌క్ష్మి డైలాగులు, చేసే ప్రోగ్రామ్స్ అన్నింటిని ట్రోల‌ర్స్ అడ్డా జోన్‌గా మార్చేసుకుంటున్నారు. ఒక్క మ‌నోజ్ మాత్ర‌మే ఈ ట్రోల‌ర్స్ భారీన ప‌డ‌ట్లేదు.

ఇక మంచు ల‌క్ష్మి కూడా అప్పుడ‌ప్పుడు ఎవ‌రో ఒక‌రిని కెలుకుతూ ట్రోల‌ర్స్ భారీన ప‌డ‌డం చూస్తూ ఉన్నాం. నాలుగైదు రోజుల క్రితం ఏపీ సీఎం జ‌గ‌న్ ట్రోల్ కంటెంట్ షేర్ చేసి.. తాను కూడా వెట‌కారం చేసిన మంచు ల‌క్ష్మి ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేసిన‌ట్టుగా ఆమె పోస్ట్ ఉంది. ప‌వ‌న్‌ను వెట‌కారం ఆడుతూ ఓ వైసీపీ సానుభూతి ప‌రుడు పెట్టిన పోస్టును ల‌క్ష్మి షేర్ చేశారు.

అక్క‌డితో ఆగ‌కుండా గుడ్ ఆర్ బ్యాడ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటో ప‌క్క‌న త‌న ఫొటో ఉండ‌డం ఎంతో థ్రిల్ క‌లిగించిందంటూ త‌న భావం పంచుకున్నారు. ఈ పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ప‌వ‌న్ మార్ష‌ల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నార‌ని.. 20 ఏళ్ల త‌ర్వాత అలాంటి అవ‌స‌రం వ‌చ్చింద‌ని ఓ ఫొటో పోస్టు చేస్తే.. దానిని ఏపీలో వైసీపీ వాళ్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

అయితే వైసీపీ ట్రోల‌ర్స్‌కు జ‌న‌సేన నాయ‌కులు కౌంట‌ర్లు ఇస్తున్నారు. అయితే గ‌తంలో మంచు ల‌క్ష్మి ఇచ్చిన అలాంటి స్టిల్‌నే ప‌వ‌న్ స్టిల్ ప‌క్క‌న పెట్టి ప‌వ‌న్ మంచు ల‌క్ష్మి స్టిల్‌ను కాపీ కొట్టారంటూ మీమ్స్ త‌యారు చేశారు. దీనిని మంచు ల‌క్ష్మి షేర్ చేశారు. అయితే ప‌వ‌న్‌పై గౌర‌వంతో షేర్ చేసినా.. అది మాత్రం ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టేలా ఉంది. మంచు ల‌క్ష్మి ప‌వ‌న్‌ను అన‌వ‌స‌రంగా కెలిగిన‌ట్టుగా ఉంద‌ని జ‌న‌సేన సైనికులు సోష‌ల్ మీడియాలో ఆమెపై మండిప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news