Moviesమా బావ మ‌నోభావాలు సాంగ్‌లో బాల‌య్య ఇచ్చిన ట్విస్ట్ చూశారా...!

మా బావ మ‌నోభావాలు సాంగ్‌లో బాల‌య్య ఇచ్చిన ట్విస్ట్ చూశారా…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ వీర‌సింహారెడ్డి. మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ న‌టిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి వ‌దులుతోన్న ప్ర‌తి ఒక్క అప్‌డేట్ సినిమాపై ఆస‌క్తిని పెంచేలా ఉంది. జై బాల‌య్యా.. జైజై బాల‌య్యా సాంగ్ – సుగుణ సుంద‌రి సాంగ్స్ సినిమా రేంజ్‌ను ఎక్క‌డికో తీసుకువెళ్లాయి. ఇక ఇప్పుడు మా బావ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ్ సాంగ్ కూడా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ కూడా మాస్‌కు పూన‌కాలు తెప్పించేలా ఉంది.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఇక బాల‌య్య స్టెప్పులు అయితే అరాచ‌కం అనిపిస్తున్నాయి. ఈ వ‌య‌స్సులోనూ బాల‌య్య ఎన‌ర్జీతో వేసిన క్రేజీ స్టెప్పులు చూస్తుంటే పూన‌కాలు వ‌స్తున్నాయి. రేపు థియేట‌ర్ల‌లో విజిల్స్ మోత మోగిపోవ‌డం ఖాయం. సాంగ్‌లో ముఖ్యంగా సోడా బండిమీద ప‌డుకుని వెన‌క‌కు న‌డుస్తూ వేసిన స్టెప్పులు చూస్తుంటే మ‌తులు పోతున్నాయి.

Balakrishna's Graceful Steps In Veera Simha Reddy New Song Maa Bava  Manobhavalu Watch Song Promo Full Song Out On Dec 24th 3.19 Pm | Veera  Simha Reddy New Song : మా బావ

అఖండ సినిమాలో జై బాల‌య్యా సాంగ్‌కు థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ ఎలా ఊగిపోయారో ఈ సాంగ్ చూస్తుంటే అదే సీన్లు రిపీట్ అయ్యేలా ఉన్నాయి. బాలయ్యతో ఈ సాంగ్ లో కనిపించిన చంద్రిక రవి – హానీ రోస్ లో తమ గ్లామ‌ర్ షోతో ఆక‌ట్టుకున్నారు.

Latest news