Moviesజై బాల‌య్య మేకింగ్ వీడియో చూస్తే గూస్‌బంప్సే... బాల‌య్యా దుమ్ము లేపేశావ్...

జై బాల‌య్య మేకింగ్ వీడియో చూస్తే గూస్‌బంప్సే… బాల‌య్యా దుమ్ము లేపేశావ్ (వీడియో)

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో వీర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తున్నాడు. వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బాల‌య్య చేస్తోన్న సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే సినిమాపై అంచ‌నాలు ఉన్నాయి. అటు క్రాక్ లాంటి మాసీవ్ హిట్ త‌ర్వాత మ‌లినేని గోపీచంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ న‌టిస్తోన్న ఈ సినిమా రాయ‌ల‌సీమ‌లోని ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ మూవీగా తెర‌కెక్క‌నుంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ఆక‌ట్టుకోగా.. రీసెంట్‌గా రిలీజ్ అయిన జై బాల‌య్య సాంగ్ మ‌రింత‌గా అల‌రించి సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత‌గా పెంచేసింది. ఇక థ‌మ‌న్ అందించిన మాస్ బీట్‌కు, క‌రీముల్లా గాత్రంతో పాటు రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం తోడు కావ‌డంతో సాంగ్ అదిరిపోయింది.

ఇప్ప‌టికే ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో చాలా త‌క్కువ టైంలోనే 10 మిలియ‌న్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ సాంగ్ మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అవుట్ డోర్ లొకేష‌న్ల‌లో ప్ర‌జ‌ల మ‌ధ్య అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో ఈ సాంగ్ షూటింగ్ జ‌రుగుతోంది. మేకింగ్ వీడియో చూస్తుంటేనే గూస్‌బంప్స్ వ‌చ్చేలా ఉన్నాయి.

మ‌రి రేపు థియేట‌ర్ల‌లో ఈ సాంగ్ చూస్తుంటే అఖండ జై బాల‌య్య సాంగ్ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు ఎలా పూన‌కాలు తెప్పించిందో ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో పూన‌కాలు తెప్పించేలా ఉంది. వీర‌సింహారెడ్డి వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news